చట్టాలపై అవగాహన అవసరం
కర్నూలు(అర్బన్): బాలల పరిరక్షణ, బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపులకు సంబంధించిన చట్టాలపై అవగాహన పెంచుకోవాలని డీసీపీఓ శారద కోరారు. శనివారం సాయంత్రం స్థానిక పెద్దపాడులో జేజే యాక్ట్, పోక్సో యాక్ట్‌పై బాలల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ బాల బాలికలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నుంచి రక్షించేందుకు 2012లో ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింద న్నారు. బాల బాలికలపై ఎక్కడైనా లైంగిక వేధింపులు జరిగితే ఫిర్యాదు చేసేందుకు నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఆన్‌లైన్ ద్వారా ఈ బాక్స్ ఏర్పా టు చేయడం జరిగిందన్నారు. లీగల్ కం ప్రొఫెషనల్ ఆఫీసర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైనా నేరాలకు గురైనప్పుడు అలాంటి వారిని బాలల న్యాయమండలి ముందు ప్రవేశ పెడతామన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు జమీలబేగం, చోటీమాబేగం,ప్రొటెక్షన్ ఆఫీసర్ పద్మ, నాన్ ప్రొటెక్షన్ ఆఫీసర్ దీపారాణి, డీసీపీయు సిబ్బంది శ్వేత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment