కర్రలపై 450 కి.మీ పాదయాత్ర
దారి పొడవునా వడివడిగా అడుగులు వేసుకుంటూ కన్నడిగులు శ్రీగిరి వైపు సాగిపోతున్నారు. వారిలో కొందరు కాళ్లకు కర్రలకు కట్టుకుని నడుస్తూ భక్తిని చాటుతున్నారు. కర్ణాటక రాష్ట్రం భాగల్‌కోట్ జిల్లా నీల్లోఖేరీ గ్రామానికి చెందిన కృష్ణగౌడు ఆరు అడుగుల ఎత్తైన కర్రలతో, మంజునాథ్ తల్వార్, మండేస్‌దేవూర్ శివ్‌దళ్వార్, హనుమంత్‌తల్వార్ నాలుగు అడుగుల ఎత్తైన కర్రలతో శ్రీశైలానికి వెళ్తున్నారు. తొమ్మిది రోజుల క్రితం బయలుదేరి దాదాపు 450 కి.మీ ప్రయాణించి జూపాడుబంగ్లా చేరుకున్నారు. మల్లన్న స్వామి తమ కోర్కెలు నెరవేర్చడంతో కర్రలపై నడుస్తూ మొక్కు తీర్చుకుంటామని వారు తెలిపారు.
– జూపాడుబంగా్ల
Comments
Please login to add a commentAdd a comment