పిడుగుపాటుతో రైతుకు అస్వస్థత
గోనెగండ్ల: వర్షం కురుస్తూ.. ఉరుములు, మెరుపు రావడంతో పొలం నుంచి ఇంటికి వస్తున్న రైతు అస్వస్థతకు గురయ్యాడు. చేతికి, వీపుకు గాయలై స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఈ ఘటన గోనెగండ్ల గ్రామ సమీపంలో శనివారం చోటుచేసుకుంది. గోనెగండ్లకు చెందిన అంగడి మాబుసాహె బ్ అనే రైతు గ్రామ శివారులో తనకు ఉన్న మూడు ఎకరాల భూమిలో సజ్జ పంటను సాగు చేశాడు. శనివారం సాయంత్రం పొలానికి వెళ్లగా అనుకోకుండా ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు వస్తుండడంతో మాబు సాహెబ్ ఇంటికి వెళ్లేందుకు తన బైకు దగ్గరకు వచ్చి స్పృహ కోల్పోయి పడిపోయాడు. ఆ దారిలో ఆటోలో వెళ్తున్న ఇతర రైతులు, కూలీలు స్పృహ కోల్పోయి పడిఉన్న రైతును గమనించి గోనెగండ్ల ఆస్పత్రికి తీసుకువచ్చారు. మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆటోలో ఎమ్మిగనూరు ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment