జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని కూడా ఇవ్వలేక మంచినీటి పథకాలు దిష్టిబొమ్మల్లా మారాయి. చుక్కనీరు అందక పల్లెల్లో ‘దాహం’ కేకలు వినిపిస్తున్నాయి. మంచినీటి కోసం పనులు మానుకొని ప్రజలంతా ఇంటి వద్దే ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయ | - | Sakshi
Sakshi News home page

జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని కూడా ఇవ్వలేక మంచినీటి పథకాలు దిష్టిబొమ్మల్లా మారాయి. చుక్కనీరు అందక పల్లెల్లో ‘దాహం’ కేకలు వినిపిస్తున్నాయి. మంచినీటి కోసం పనులు మానుకొని ప్రజలంతా ఇంటి వద్దే ఉండాల్సిన దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయ

Published Mon, Mar 24 2025 5:59 AM | Last Updated on Mon, Mar 24 2025 6:00 AM

జలం ఇ

జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని

హొళగుంద మండలం నెరణికి గ్రామంలో

నీటి కోసం బిందెలను తీసుకొచ్చిన దృశ్యం

ఎండాకాలంలో ప్రజలకు అందని

మంచినీరు

తుంగభద్ర దిగువ కాలువ ఉన్నా

తప్పని తిప్పలు

76 గ్రామాల్లో నీటి ఎద్దడి ఉంటుందని

అధికారుల అంచనా

రూ.6.91 కోట్ల ప్రతిపాదనలు పంపినా

కనిపించని ఫలితం

అడుగంటుతున్న ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లోని

నీటి నిల్వలు

కర్నూలు(అర్బన్‌): వేసవి కాలం ప్రారంభం కావడం, భూగర్భ జలాలు అడుగంటడం తదితర కారణాలో జిల్లాలో అనేక గ్రామాలు తాగునీటి ఇబ్బందులను చవిచూస్తున్నాయి. పల్లెల్లో చేతిపంపులు పనిచేయకపోవడంతో ప్రజలు వ్యవసాయ బావులు, బోర్లపై ఆధారపడ్డారు. తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొని జిల్లా పశ్చిమ ప్రాంతంలో పరిస్థితి దయనీయంగా మారింది. పలు గ్రామాల్లో సమీపంలోని ఎస్‌ఎస్‌ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ప్రజల అవసరాలకు సరిపోవడం లేదు. కొంతమేర ముందస్తు చర్యలు చేపట్టినా.. ఆయా ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లోని నీటి నిల్వలు రోజు రోజుకు తగ్గిపోతుండడంతో భవిష్యత్తును తలచుకొని ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు రిజర్వాయర్లు, ఎస్‌ఎస్‌ ట్యాంకుల నుంచి సరఫరా అవుతున్న నీరు చివరి గ్రామాల వరకు వెళ్లకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

నీరు బంద్‌ అయితే..

జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఎస్‌ఎస్‌ ట్యాంకులన్నీ తుంగభద్ర దిగువ కాలువ (ఎల్‌ఎల్‌సీ) నీటిపై ఆధారపడినవే. ఈ నీటిని ఈ నెలాఖరు, ఏప్రిల్‌ 10వ తేదీన బంద్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు నీటిపారుదల అధికారులు చెబుతున్నారు. ఈ నీరు బంద్‌ అయితే ఈ నీటిపై ఆధారపడిన ఎస్‌ఎస్‌ ట్యాంకుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారనుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో వేసవి ప్రారంభంలోనే ఎల్‌ఎల్‌సీ నీటితో ఆయా ప్రాంతాల్లోని ఎస్‌ఎస్‌ ట్యాంకులన్నింటినీ మందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఒకటికి రెండు సార్లు నింపారు. దీంతో నీటి సమస్య ఎక్కడా ఉత్పన్నం కాలేదు. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ ట్యాంకుల్లో కూడా 50 నుంచి 75 శాతం నీటి నిల్వలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరు నాటికి ఈ నిల్వలు మరింత తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికై నా ఎల్‌ఎల్‌సీ నీటితో మరోసారి ఆయా ట్యాంకులను నింపుకోగలిగితే కొంత ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి.

స్పందించని ప్రభుత్వం

జిల్లాలో ప్రస్తుత వేసవిలో 76 గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడికి గురయ్యే ప్రమాదం ఉందని, ఆయా గ్రామాల్లో వేసవి దాహార్తిని ఎదుర్కొనేందుకు రూ.6.91 కోట్లు వ్యయం కానుందని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పటికే అనేక గ్రామాల్లో ట్రాన్స్‌పోర్టేషన్‌, హైరింగ్‌ ద్వారా నీటిని అందించాల్సిన పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

తాగునీటికి 2 కిలోమీటర్లు

వెళ్లాల్సిందే

విద్యుత్‌ తీగలు తెగిపోవడం, పైప్‌లైన్‌ పనులు జరుగుతున్న నేపథ్యంలో గోనెగండ్ల మండలం బీ అగ్రహారం గ్రామానికి చెందిన ప్రజలు గత వారం రోజులుగా గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోని వ్యవసాయ బోర్ల నుంచి తాగునీటిని తెచ్చుకుంటున్నారు. సైకిళ్లు, తోపుడు బండ్లు, మోటారు సైకిళ్లపై బిందెలు వేసుకొని పోయి నీటిని తెచ్చుకుంటున్నారు. అలాగే మండల కేంద్రమైన గోనెగండ్లలో కూడా నాలుగు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బైలుప్పల, హెచ్‌ కై రవాడి గ్రామంలోని బీసీ, జమ్మన్న కాలనీల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. అలాగే ఎమ్మిగనూరు మండలంలోని అల్వాల ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి మూడు రోజులకు ఒకసారి నీరు వదులుతుండడం వల్ల పెసలదిన్నె, గార్లదిన్నె తీవ్ర మంచి నీటి ఎద్దడి నెలకొంది.

గ్రామీణం.. ప్ర‘జల’ కష్టం

ఆలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలకు చెందిన అనేక గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొనింది. హాలహర్వి మండలం బాపురం రిజర్వాయర్‌ నుంచి 27 గ్రామాలకు, చింతకుంట రిజర్వాయర్‌ నుంచి 11 గ్రామాలకు నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే పైప్‌లైన్లు లీకేజీ కావడం, ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు శిథిలావస్థకు చేరడంతో పదుల సంఖ్యలో గ్రామాలకు నీరందని పరిస్థితి నెలకొనింది. చింతకుంట రిజర్వాయర్‌ కింద టీ చాకిబండ, మల్లికార్జునపల్లి, అమృతాపురం, బళ్లూరు తదితర గ్రామాలకు నీరు అందడం లేదు. బాపురం రిజర్వాయర్‌ కింద ఆస్పరి మండలంలోని చిన్నహోతూరు, జోహరాపురం, నాగనాథనహళ్లి రిజర్వాయర్‌ కింద చిగిలి, తంగరడోణ, అలాగేర, శంకరబండ, నగరూరు గ్రామాల్లో ప్రజల క‘న్నీటి’ కష్టాలు కనిపిస్తున్నాయి.

ఎండుతున్న గొంతులు

హొళగుంద మండలం విరుపాపురం ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి నీరు సరఫరా కాకపోవడంతో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెరణికి గ్రామంలో 2 వేల జనాభా ఉందని, 100 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌, ఆర్‌ఓ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన కరువైంది. అ లాగే మంత్రాలయం మండలంలోని చెట్నేహళ్లి, కల్లుదేవకుంట గ్రామాలకు ఎన్‌ఏపీ స్కీం నుంచి నీరు అందడం లేదు. గొంతులు ఎండుతున్నా యని, తాగునీటి సమస్య తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు ఇటీవలే ఎన్‌ఎహ్‌ 167పై రాస్తారోకో నిర్వహించారు. అయినా స్పందన లే దు. ఎన్‌ఏపీ స్కీం నుంచి నందవరం మండలం ఇబ్రహీంపురం, ఇబ్రహీంపురం కొట్టాల, మంత్రాలయంతోపాటు మరో మూడు గ్రామాలకు అరకొరగా నీరు సరఫరా అవుతోంది.

అంతటా నీటి ఎద్దడే

పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం లింగనేనిదొడ్డి, పత్తికొండ మండలం అటికెలగుండు, దేవనబండ, చక్రాళ్ల, పెండ్లిమాన్‌ తండా, కృష్ణగిరి మండలం బాపనదొడ్డి, పెద్దొడ్డి, బోయబొంతిరాళ్ల గ్రామాల్లో నీటి ఎద్దడి ఏర్పడింది. అలాగే ఆదోని మండలం బసరకోడు, అలసందగుత్తి, దిబ్బనకల్‌, నెట్టేకల్‌, చిన్న పెండేకల్‌, పెద్ద పెండేకల్‌, బైచిగేరి తదితర గ్రామాల్లో బోర్లు సరిగా పనిచేయడం లేదు. పైప్‌లైన్లు సక్రమంగా లేకపోవడం వల్ల నీటి ఇబ్బందులు తలెత్తాయి. జిల్లాలో చాలా గ్రామాల్లో నీటి ఎద్దడి కనిపిస్తోంది.

జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని 1
1/3

జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని

జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని 2
2/3

జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని

జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని 3
3/3

జలం ఇవ్వలేక చేతి పంపులు ‘బోరు’మంటున్నాయి. బిందె నీటిని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement