● డ్వామా పీడీ వెంకటరమణయ్య
కర్నూలు(అగ్రికల్చర్): వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు గ్రామీణ ప్రాంతాల్లో నీటి తొట్లు ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరమణయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. నీటి తొట్లు ఎక్కడెక్కడ అవసరమనే దానిపై వివరాలు ఇవ్వాలని పశుసంర్ధక శాఖ అధికారులను అడిగామని, వారు నివేదిక మేరకు 300 తొట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతామన్నారు. ఏప్రిల్ మూడో వారంలో పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. మే నెల చివరిలోపు జిల్లాలో 8,500 ఫాంపాండ్స్ నిర్మించనున్నామని పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి పంట కాల్వలు, పీడర్ చానళ్లల్లో పేరుకపోయిన పూడికను తొలగిస్తామన్నారు. రానున్న రోజుల్లో ఉపాధి పనులకు లేబర్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, డిమాండ్‌కు అనుగుణంగా చెరువులు, కుంటల్లో కూడా పూడిక తీసేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.