
కక్ష కట్టి.. పంటను నీట ముంచి
పగిడ్యాల: పాత ముచ్చుమర్రిలో వైఎస్సార్‌సీపీ నాయకుడు, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి వర్గీయుడైన చల్లా శ్రీనివాసరెడ్డిపై రాజకీయ ప్రత్యర్థులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. చల్లా శ్రీనివాసరెడ్డి దాదాపు ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని రబీ సీజన్‌లో కంది సాగు చేశాడు. పంట కోత దశకు రాగా ఈనెల 4న కోత కోసి పొలంలోనే కుప్పలు వేసి సొంత పని మీద కడపకు వెళ్లాడు. ఆయన ఊర్లో లేని సమయం చూసి రాజకీయ ప్రత్యర్థులు ఆదివారం కోసిన కంది పంట కుప్పలపై నీరు పారించారు. సాయంత్రం గ్రామానికి రాగానే పొలానికి వెళ్లి చూడగా తన పొలమంతా నీరు పారి కంది కట్టె కుప్పలు కుళ్లిపోయి కనిపించాయి. గింజలు ఉబ్బిపోయి మొలకలు రావడంతో కన్నీరుమున్నీర య్యాడు. ప్రస్తుతం ఎకరాకు 9 క్వింటాళ్ల వరకు దిగుబడి రాగా.. దాదాపు 40 క్వింటాళ్ల మేర నష్టం వాటిల్లింది. పెట్టుబడి ఖర్చులు, కౌలు రూ.2 లక్షలు చెల్లించి పంట దిగుబడి కోసం నిరీక్షించగా అంతా నీటిపాలు చేశారని బాధితుడు వాపోయాడు. జరిగిన ఘటనపై ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి సిబ్బందితో పంటను పరిశీలించారు.
కంది కుప్పలపై నీరు పారించిన
రాజకీయ ప్రత్యర్థులు
వైఎస్సార్‌సీపీ నేతకు చెందిన
ఐదు ఎకరాల్లో పంట నష్టం

కక్ష కట్టి.. పంటను నీట ముంచి