వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
గూడూరు: విద్యార్థులు ఇష్టంతో చదివి వందశాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నా రు. మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలుర హైస్కూల్‌ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ముందుగా తరగతి గదులన్నీ తిరిగి విద్యార్థులతో మాట్లాడారు. మధ్యాహ్న భోజనం వంటలను పరిశీలించి, మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత ఉపాధ్యాయులతో సమావేశమై ప్రతీరోజు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ విద్యార్థుల విద్యాభివృద్ధికి పాటుపడాలని కోరారు. అనంతరం మండల స్థా యి చెకుముకి పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. జిల్లాస్థాయికి ఎంపికై న వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ రవికుమార్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
పదో తరగతి తొలిమెట్టు
మహబూబాబాద్‌అర్బన్: విద్యార్థుల చదువులో విజయానికి తొలిమెట్టు పదో తరగతి అని డీఈఓ రవీందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలికల జెడ్పీహెచ్‌ఎస్‌ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ.. విద్యార్థులు ఉన్నత లక్ష్యంతో చదవాలని, పోటీతత్వం అలవర్చుకోవాలన్నారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే దిశగా ఉపాధ్యాయులు ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు గిరిజ, వసంత, శ్రీవాణి, రమేష్, సంజీవ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment