పాల ఉత్పత్తిలో భారత్ మొదటిస్థానం
మామునూరు : పాల ఉత్పత్తిలో ప్రపంచంలో భారత్ మొదటి స్థానంలో ఉందని కేవీకే కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న పేర్కొన్నారు. మంగళవారం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ, విజ్ఞాన శాస్త్రవేత్త డాక్టర్ అరుణాజ్యోతి, సౌమ్య ఆధ్వర్యంలో విలువ ఆధారిత పాల ఉత్పత్తులపై శిక్షణ నిర్వహించగా రాజన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పాల ఉత్పత్తులను కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని అధిక లాభాలను పొందవచ్చని సూచించారు. పాల ఉత్పత్తి, ఆదాయ మార్గాలపై డాక్టర్ అరుణాజ్యోతి రైతులకు అవగాహన కల్పించారు.
కేవీకేను సందర్శించిన విద్యార్థులు
మామునూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని నర్సంపేట, దుగ్గొండి హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు ఎడ్యుకేషనల్ విజిట్ టూర్‌లో భాగంగా మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేవీకే అందించే సేవలు, చేపల పెంపకం, వర్మి కంపోస్ట్ తయారీ, ప్లాస్టిక్ మల్చింగ్ పద్ధతిలో కూరగాయల సాగు, అజోల్లా ఉపయోగాలు, సోలార్ వినియోగం, పెరటి కోళ్ల పెంపకం, వ్యవసాయ పనిముట్ల ఉపయోగాలపై శాస్త్రవేత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ రాజన్న, సౌమ్య, రాజు, అరుణాజ్యోతి, గణేశ్, సాయికిరణ్, సాయిచంద్, శుష్రుత్ పాల్గొన్నారు.
కేవీకే కోఆర్డినేటర్ రాజన్న
Comments
Please login to add a commentAdd a comment