అట్టహాసంగా ఆలిండియా టోర్నమెంట్స్ షురూ
కాజీపేట అర్బన్ : నిట్ వరంగల్‌లోని మైదానంలో శుక్రవారం అట్టహాసంగా మూడు రోజుల ఆల్ ఇండియా ఇంటర్ ఎన్‌ఐటీ టోర్నమెంట్స్ ప్రారంభమయ్యాయి. టోర్నమెంట్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు జీఆర్ కిరణ్ పాల్గొని టోర్నమెంట్స్ పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. దేశవ్యాప్త ఎన్‌ఐటీల నుంచి 775 మంది విద్యార్థులు టోర్నమెంట్లలో పాల్గొననున్నట్లు డీన్ శ్రీనివాసాచార్య తెలిపారు. మూడు రోజుల టోర్నమెంట్లలో భాగంగా హ్యాండ్‌బాల్, వాలీబాల్, యోగా పోటీల్లో విద్యార్థులు పోటీ పడనున్నట్లు స్పోర్ట్స్ యాక్టివిటీస్ హెడ్ పి.రవికుమార్ తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ అజీమ్, దయానిధి, పాల్గొన్నారు.
అట్టహాసంగా ఆలిండియా టోర్నమెంట్స్ షురూ
Comments
Please login to add a commentAdd a comment