కిడ్నాప్ కేసులో ఇద్దరి అరెస్ట్
కాటారం : మండల కేంద్రంలోని ఓ కాలనీకి చెందిన బాలికను కిడ్నాప్ చేసిన కేసును పోలీసులు ఛేదించి ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మండల కేంద్రంలోని పీఎస్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగార్జునరావు, ఎస్సై మ్యాక అభినవ్ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం గ్రామానికి చెందిన పొల్ల వేణు.. బాలికకు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమయ్యాడు. రెండ్రోజుల క్రితం సదరు బాలికను పెళ్లి చేసుకుందామని మాయమాటలు చెప్పి వేణుతో పాటు మరో యువకుడు పొన్న దిశాంత్ అలియాస్ నాగరాజు కారులో కాటారం వచ్చి ఆమెను ఎక్కించుకుని వెళ్లిపోయారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా కారును గుర్తించి హైవేపై గల పోలీస్‌స్టేషన్లను అప్రమత్తం చేశారు. తొర్రూరు పోలీసుల సాయంతో కిడ్నాప్‌నకు గురైన బాలికతో పాటు నిందితులను గుర్తించినట్లు సీఐ, ఎస్సై తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కాటారం పోలీస్ స్టేషన్‌కు తీసుకురాగా నేరం ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించి కారు, సెల్‌ఫోన్ సీజ్ చేసినట్లు వివరించారు. కేసును చేధించిన సీఐ, ఎస్సైతో పాటు ఐటీకోర్ కానిస్టేబుల్ వేణు, స్వామిగౌడ్, జంపన్న, లక్ష్మీరాజ్, లవన్, తిరుపతి, రజనీని డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment