అట్టహాసంగా కొడవటంచ జాతర
రేగొండ: భక్తుల కొంగుబంగారం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అభిషేకంతో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. అనంతరం స్వామి వారిని సూర్యవాహన సేవలో మాడ వీధుల గుండా ఊరేగించారు. సాయంత్రం స్వస్తివాచనం అనంతరం శేషవాహనసేవ, అంకురారోహనం కార్యక్రమాలు కొనసాగాయి. జాతర మొదటి రోజు కావడంతో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. కాగా, బ్రహ్మోత్సవాలు ఈ నెల 9నుంచి 16వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఈఓ మహేశ్, ఆలయ కమిటీ చైర్మన్ ముల్కనూరి భిక్షపతి, సిబ్బంది శ్రావణ్, రవీందర్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.
భక్తుల కోసం సకల సౌకర్యాలు..
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్, ఆరోగ్య, ఆర్‌డబ్ల్యూఎస్, గ్రామపంచాయతీ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.
తరలివచ్చిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment