నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు
● రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
గోవిందరావుపేట: నిరుపేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలో రూ.5 లక్షల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి కలెక్టర్ దివాకర టీఎస్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలోని మండల కేంద్రాల్లో ఇందిరమ్మ మో డల్ హౌస్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ములు గు జిల్లాలో మొదటిసారి గోవిందరావుపేట మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. నిరుపేదలు మోడల్ హౌస్‌ను పరిశీలించి తక్కువ ధర, నాణ్యతతో తమ ఇల్లు నిర్మించుకోవాలని సూచించారు. రాబోయే నాలుగు సంవత్సరాల్లో పేదల సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభించుకున్నామన్నారు. ప్రతీ దశలో ఇంటి నిర్మాణ పురోగతి వి వరాలు ఇందిరమ్మ ఇళ్ల యాప్‌లో నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ, తహసీల్దార్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment