కిక్కిరిసిన రైల్వేస్టేషన్
డోర్నకల్: డోర్నకల్ రైల్వేస్టేషన్ మంగళవారం ప్రయాణికులతో కిక్కిరిసిపోయింది. 2వేల మందికి పైగా మహారాష్ట్రకు చెందిన కూలీలు తరలిరావడంతో రైల్వేస్టేషన్ జనసంద్రమైంది. మూడు నెలల క్రితం మిరప తోటల్లో కాయకోత పనులకు మహా రాష్ట్ర నుంచి వేలాదిగా కూలీలు తరలివచ్చారు. రైళ్ల ద్వారా డోర్నకల్ స్టేషన్‌కు చేరుకుని ఇక్కడి నుంచి మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, కృష్ణా జిల్లాలకు తరలివెళ్లారు. కాయకోత పనులు పూర్తి కావడంతో కొద్ది రోజుల నుంచి కూలీలు డోర్నకల్ మీదుగా మహా రాష్ట్రకు తిరిగి వెళ్తున్నారు. పది రోజులుగా సింగరేణి రైలులో ప్రతీరోజు 500 నుంచి 1000మందికి పైగా తరలివెళ్తున్నారు. మంగళవారం 2వేల మందికి పై గా కూలీలు రైల్వే స్టేషన్‌కు వచ్చారు. కాగా సింగరేణి రైలులో కొత్తగూడెం, కారెపల్లి స్టేషన్లలో అధిక సంఖ్యలో కూలీలు ఎక్కడంతో డోర్నకల్‌కు చేరుకునే సమయనికే రైలు కాలు పెట్టలేనంత రద్దీగా మారింది. డోర్నకల్‌లో కూలీలు రైలు ఎక్కేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో కొంతమంది ఘర్షణ పడి కొట్టుకున్నారు. ఆర్పీఎఫ్ సిబ్బంది రైలును కొద్దిసేపు నిలిపి కూలీలను ఎక్కించే ప్రయత్నం చేశారు. సగం మందికి పైగా రైలు ఎక్కలేకపోవడంతో తర్వాత వచ్చిన శాతవాహన, గోల్కొండ రైళ్లలో పంపించారు.
మహారాష్ట్రకు కూలీల తిరుగుప్రయాణం
Comments
Please login to add a commentAdd a comment