ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
మహబూబాబాద్ అర్బన్: ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కంకరబోడ్ జెడ్పీహెచ్‌ఎస్‌ను ఎమ్మెల్సీగా గెలిచిన అనంతరం మొదటిసారి మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పీఆర్‌టీయూ ఉపాధ్యాయులకు కంకరబోడ్ పాఠశాల పవిత్రమైందని, చామల యాదగిరి ఇదే పాఠశాలలో పీఆర్‌టీయూ సంఘాన్ని స్థాపించారన్నారు. 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన్ వర్తింపు, పెండింగ్ బకాయిల విడుదల, కేజీవీబీ, ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ వర్తింపు, మ్యూచువల్ బదిలీలు, గురుకుల, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డిని ఉపాధ్యాయులు సన్మానించారు. పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సంకా బద్రినారాయణ, ప్రధాన కార్యదర్శి మిర్యాల సతీశ్‌రెడ్డి, పాఠశాల హెచ్‌ఎం కోట్యానాయక్ తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment