గుంపులుగా ఉండొద్దు : ఎస్పీ సుధీర్‌రాంనాథ్ కేకన్
పదో తరగతి పరీక్ష కేంద్రాలకు 500 మీటర్ల దూ రం వరకు ఇద్దరికి మించి గుంపులుగా ఉండొద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్ సూచించారు. కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకులు, డీజేలతో ఊరేగింపులు, ధర్నాలు, ప్రచారం చేయవద్దన్నారు. పరీక్ష జరుగుతున్న సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లు మూసివేయాలని పేర్కొన్నారు. ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద 163–బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ అమలో ఉంటుందన్నారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ పోలీసులు పట్టిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ ఉంటుందని, నింబధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment