ఎట్టకేలకు.. ఉద్యోగాల భర్తీ! | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు.. ఉద్యోగాల భర్తీ!

Published Fri, Mar 28 2025 1:37 AM | Last Updated on Fri, Mar 28 2025 1:39 AM

చివరి తేదీ : 29–03–2025
ఈద్గాల్లోనే రంజాన్‌ ప్రార్థనలు

I

వసంతాలకు అనాది. శుభాలకు పునాది. తెలుగు సంవత్సరాది.. ఉగాది. కోయిలమ్మ కమ్మని స్వరాల నడుమ, షడ్రుచుల మేళవింపులో కోటి ఆశలకు రెక్కలు తొడుగుతూ వచ్చే వేడుక ఇది. తెలుగుదనం ఉట్టిపడేలా.. సంప్రదాయానికి జీవం పోసేలా సాగే పర్వదినమిది. కొత్త సంవత్సరం ప్రారంభమయ్యే వేళ కవుల భావాలకు ‘సాక్షి’ అక్షరరూపం ఇస్తోంది. మరింకెందుకాలస్యం.. కలాలు కదిలించండి.. ఉగాదిపై కవితలు రాయండి.

నెహ్రూసెంటర్‌: జిల్లా వైద్యారోగ్యశాఖ ఎన్‌హెచ్‌ఎం పరిధిలో ఉద్యోగాల భర్తీకి ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఎన్‌హెచ్‌ఎంలో 37పోస్టులకు నోటిఫికేషన్‌ జారీకాగా.. 1,661 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా గత ఏడాది నవంబర్‌లో 37 పోస్టులకు మెరిట్‌ లిస్టు ప్రకటించి, సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, కౌన్సెలింగ్‌ నిర్వహించి 14పోస్టులు మాత్రమే భర్తీ చేశారు. 23 పోస్టుల భర్తీ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఆందోళనకు దిగారు. కాగా ఎట్టకేలకు వాయిదా వేసిన ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్‌ లిస్టును నేడు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు. అయితే గత మెరిట్‌ లిస్టుకు ప్రస్తుతం ఇవ్వబోతున్న మెరిట్‌ లిస్టుకు ఏమైనా తేడా ఉంటుందా అని అభ్యర్థులో ఉత్కంఠ నెలకొంది. కాగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై ‘సాక్షి’ దినపత్రికలో వరుస కథనాలు వెలువడగా.. వైద్యారోగ్యశాఖ అధికారుల్లో కదలిక వచ్చింది.

భర్తీ కానున్న ఉద్యోగాలు ఇవే...

సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, కౌన్సెలింగ్‌ రోజు వాయిదా వేసిన ఉద్యోగాలకు సంబంధించిన మెరిట్‌ లిస్టు నేడు వెబ్‌సైట్‌లో పొందుపర్చనుండగా.. అభ్యర్థుల్లో ఉత్సాహం నెలకొంది. కాగా మెరిట్‌ లిస్టు, భర్తీ ప్రక్రియలో నిలిపివేసిన ఎంఎల్‌హెచ్‌పీ–10పోస్టులు, ఎన్‌సీడీ స్టాఫ్‌నర్సు–10, ఎంహెచ్‌ఎన్‌ స్టాఫ్‌నర్సు–2పోస్టులను అధికారులు భర్తీ చేయనున్నారు.

నేడు మెరిట్‌లిస్టు విడుదల..

వైద్యారోగ్యశాఖలో ఎన్‌హెచ్‌ఎం పథకంలో గతంలో నిలిపివేసిన ఎంఎల్‌హెచ్‌పీ, స్టాఫ్‌నర్సులు, ఎన్‌సీడీ స్టాఫ్‌నర్సులు, మెకానిక్‌ పోస్టులకు సంబంధించిన మెరిట్‌ జాబితాను నేడు వెబ్‌సైట్‌లో పొందుపర్చనున్నట్లు డీఎంహెచ్‌ఓ మురళీధర్‌ గురువారం తెలిపారు. మెరిట్‌ జాబితాపై ఈ నెల 29నుంచి ఏప్రిల్‌ 3వరకు అభ్యంతరాలు స్వీకరిస్తామని, వివరాలకు మహబూబాబాద్‌.తెలంగాణ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో చూడవచ్చన్నారు.

పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ

ఎన్‌హెచ్‌ఎం పరిధిలో జరుగుతున్న ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. నిబంధనల ప్రకారం మెరిట్‌ ఉన్నవారికే ఉద్యోగాలు వస్తాయి. ప్రస్తుతం 22 పోస్టులను భర్తీ చేయనున్నాం. దీనికి సంబంధించిన మెరిట్‌ లిస్టు కార్యాలయంలో, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతున్నాం.

–మురళీధర్‌, డీఎంహెచ్‌ఓ

వైద్యారోగ్యశాఖలో

నియామకాలకు ముహూర్తం

22 పోస్టులకు నేడు మెరిట్‌ జాబితా విడుదల

ఎట్టకేలకు.. ఉద్యోగాల భర్తీ! 1
1/3

ఎట్టకేలకు.. ఉద్యోగాల భర్తీ!

ఎట్టకేలకు.. ఉద్యోగాల భర్తీ! 2
2/3

ఎట్టకేలకు.. ఉద్యోగాల భర్తీ!

ఎట్టకేలకు.. ఉద్యోగాల భర్తీ! 3
3/3

ఎట్టకేలకు.. ఉద్యోగాల భర్తీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement