మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి
దంతాలపల్లి: వేసవికాలంలో ఆయిల్‌పామ్ తోటల రక్షణకు రైతులు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. మండలంలోని దాట్ల గ్రామంలో గురువారం ఆయన ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించి మాట్లాడారు. వేసవికాలంలో పామాయిల్ లేత మొక్కలు, కొమ్మలకు పురుగు బెడద ఉంటుందన్నారు. మొక్క రక్షణకు పాదుల చుట్టూ రెండు వరుసల్లో జీలుగు వేయాలని సూచించారు. జీలుగు మొక్కలను రక్షించడంతో పాటు పోషకాలు అందిస్తున్నారు. వేసవిలో నీటికొరత లేకుండా చూడాలని, మొక్కలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మొక్కలకు చీడ, పీడలు ఆశిస్తే అధికారులను సంప్రదించాలని రైతులకు సూచించారు. అనంతరం రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
అప్రమత్తంగా ఉండాలి
తొర్రూరు రూరల్: ఆయిల్‌పామ్ రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి జినుగు మరియన్న అన్నారు. గురువారం మండలంలోని అరిపిరాల, వెంకటాపురం గ్రామాల్లో సాగు చేస్తున్న ఆయిల్‌పామ్ తోటలను పరిశీలించారు.