
పాముల రూపంలో దర్శనమిచ్చే కొండలమ్మ దేవత
గార్ల: ఉగాది సందర్భంగా జరగనున్న కొండలమ్మ జాతర సమయంలోనే గుడి రాళ్ల సొరికెల నుంచి స ర్పాలు బయటకు వచ్చి కనిపిస్తుంటాయి. వాటిని దేవతలుగా భావించి భక్తులు ఆరాధిస్తుంటారు. గా ర్ల మండలం పినిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో కొ ండలమ్మ,బయ్యమ్మ, గారమ్మలు ముగ్గురు అక్కాచెల్లెళ్లు. ఆ దేవతామూర్తులకు కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడు దేవాలయం నిర్మించారని పూర్వీ కులు చెబుతుంటారు. జాతర సమయంలోనే సొరి కెల నుంచి పాములు బయటకు వచ్చి మళ్లీ తిరిగి లోపలికి వెళ్లిపోతాయి. మిగతా రోజుల్లో అవి కని పించవు. కొండలమ్మ పేరుమీద కొండలమ్మ చెరువు, గారమ్మ పేరుమీద గార్ల చెరువు, బయ్యమ్మ పేరుమీద బయ్యారం చెరువును కాకతీయులు నిర్మించి నామకరణం చేసినట్లు పూర్వీకులు చెప్పుకుంటారు.

పాముల రూపంలో దర్శనమిచ్చే కొండలమ్మ దేవత

పాముల రూపంలో దర్శనమిచ్చే కొండలమ్మ దేవత