నేటినుంచి ‘పది’ పరీక్షలు
మహబూబాబాద్ అర్బన్: పదో తరగతి వార్షిక పరీ క్షలకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. నేటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. కాగా సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయి. సెంటర్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా 5నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను కూడా పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తామని డీఈఓ రవీందర్‌రెడ్డి తెలిపారు.
46 కేంద్రాలు..
పదో తరగతి పరీక్షలు ఉదయం 9:30నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ పరీక్షలు మాత్రం ఉదయం 9:30నుంచి 11గంటల వరకు జరుగుతాయి. కాగా రోజు విడి చి మరుసటి రోజు పరీక్షలు నిర్వహిస్తారు. జిల్లాలో 46 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 8,194 మంది,ప్రైవేట్ విద్యార్థులు 120మంది పరీక్షలు రా యనున్నారు. 470మంది ఇన్విజిలేటర్లు విధులు ని ర్వర్తిస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థులు పరీ క్ష కేంద్రాలకు గంట ముందే చేరుకోవాలని సూచించారు.అన్ని పరీక్ష కేంద్రాలకు సీఎస్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లను నియమించారు. వారు నిర్వర్తించాల్సిన విధులపై ప్రత్యేక సలహాలు, సూచనలు ఇచ్చారు.
వసతుల కల్పన..
పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, టాయిలెట్స్, విద్యుత్, విద్యార్థుల కోసం బల్లలు ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ప్రాథమిక చికిత్స కోసం కేంద్రాల వద్ద ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉంటారు. ప్రాథమిక చికిత్స చేసి మందులు అందజేస్తారు. కాగా అధికారులు, విద్యార్థులు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు పరీక్ష కేంద్రాల్లోకి తీసుకెళ్లొద్దని అధికారులు సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా విద్యార్థులు చెప్పులు మాత్రమే ధరించి పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడిన, ప్రోత్సహించిన వారిని గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తామన్నారు.
సమస్యాత్మక కేంద్రాల వద్ద
కట్టుదిట్టమైన బందోబస్తు...
జిల్లాలోని సమస్యాత్మకమైన దంతాలపల్లి, తొర్రూరు, గార్ల సెంటర్ల వద్ద రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అందుకు ఉపాధ్యాయులు సక్రమంగా విధులు నిర్వహించాలన్నారు. జిల్లాలో సిట్టింగ్, ఫ్లయింగ్, రూట్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.
పరీక్షల వివరాలు
రెగ్యులర్ విద్యార్థులు 8,194 మంది
ప్రైవేట్ విద్యార్థులు 120 మంది
పరీక్ష కేంద్రాలు 46
ఇన్విజిలేటర్లు 470 మంది
ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
జిల్లాలో 46 పరీక్ష కేంద్రాలు
సెంటర్ల వద్ద 163–బీఎన్‌ఎస్‌ఎస్
సెక్షన్ అమలు
5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతి
సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం
‘పది’ విద్యార్థులకు ఆర్టీసీ బస్సు సౌకర్యం
నెహ్రూసెంటర్: జిల్లాలో నేటినుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు రాసే విద్యార్థులు కేంద్రాల వద్దకు పల్లె వెలుగు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని మానుకోట ఆర్టీసీ డీఎం శివప్రసాద్ గురువారం తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా విద్యార్థినులకు ఉచిత ప్రయాణం, బాలురకు చెల్లుబాటు అయ్యే బస్‌పాసు ఉండి హాల్ టికెట్ చూపితే రూటుతో సంబంధం లేకుండా బస్సుల్లో ప్రయాణించవ్చని చెప్పారు. బాలురు బస్‌పాసు ఉండి ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కినట్లయితే కాంబినేషన్ టికెట్ ఇచ్చి అనుమతించబడుతుందని, పాసు లేని వారు టికెట్ తీసుకోవాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment