ఇల్లెందు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తాం
బయ్యారం: ములుగు తరహాలో ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క అన్నారు. గురువారం మండలంలోని పలు గ్రామాల్లో రూ.9.90కోట్ల నిధులతో నిర్మించనున్న రహదారులు, బ్రిడ్జి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రాజీవ్ యువశక్తి పథకం ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పారు. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు పేదలంటే అభిమానం లేదని, తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో పేదల కోసం 3500 ఇళ్లు నిర్మించనుందన్నారు. పేదలకు ఉచిత కరెంట్ ఇస్తున్న ఘనత సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు బస్సులు అందజేశామని, రాబోయే రోజుల్లో మిల్లులు, గోదాముల నిర్వహణ బాధ్యత మహిళలకే అప్పగించనున్నట్లు తెలిపారు. బయ్యారం మండలంలోని రైతుల రెండు పంటలకు అవసరమైన నీటిని పాకాల చెరువు నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అందించేందుకు త్వరలో నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి వివరిస్తామన్నారు. అనంతరం బయ్యారం పెద్ద చెరువును మంత్రి సీతక్క పరిశీలించారు.
శిలాఫలకాలపై కానరాని ఎమ్మెల్సీ పేరు..
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన శిలాఫలకాలపై పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్,ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఉన్నారు.
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
కొత్తగూడ: ప్రజా సంక్షేమమే లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. మండల కేంద్రంలోని రైతువేదికలో ఏర్పాటు చేసిన సమావేశంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్‌ను ప్రారంభించారు.
మంత్రి ధనసరి సీతక్క
Comments
Please login to add a commentAdd a comment