మరిపెడ రూరల్: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రస్థాయిలో ముందు వరుసలో ఉండాలని కలెక్టర్ అద్వైత్‌కుమా ర్ సింగ్ విద్యార్థులకు సూచించారు. మరిపెడ మండలం గిరిపురం క్రాస్ రోడ్డులోని కేజీబీవీ విద్యాలయాన్ని గురువారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. వసతి గృహంలోని కిచెన్ షెడ్, తరగతి గదులు, పరిసరాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి గృహాల్లో తగిన సౌకర్యాలు కల్పిస్తూ రుచికరమైన ఆహారం అందించాలని సూ చించారు. మెనూ పక్కాగా పాటించాలన్నారు. రాష్ట్రస్థాయిలో జిల్లా అత్తుత్తమ ఫలితాలు సాధించడానికి కొన్ని రోజుల నుంచి ప్రణాళిక ప్రకారం విద్యాశాఖ ముందుకు వెళ్తుందన్నారు.
పీహెచ్‌సీ తనిఖీ
మరిపెడ: మరిపెడలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ తనిఖీ చేశారు. రికార్డులు, ఇన్‌పేషెంట్లు, అవుట్‌పేషెంట్ల వివరాలు తెలుసుకున్నారు. పరిసరాలను పరిశీలించి మాట్లాడారు. ప్రస్తుత వాతవరణ పరిస్థితుల దృష్ట్యా ఆస్పత్రుల్లో తగిన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు.
ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి
మహబూబాబాద్: ఓటరు నమోదుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అద్వైత్‌కుమార్‌సింగ్ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మినీ స మావేశ మందిరంలో ఓటరు నమోదు, ఇతర ఎన్ని కల అంశాలపై అన్ని రాజకీయ పార్టీల ప్రతి నిధులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఒకే కుటుంబ సభ్యులు ఒకే చోట ఓటు హక్కు వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, సంబంధిత అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్