తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ – 2025లో వెల్లడి
తలసరి ఆదాయంలో అంతంతే..
2023–24లోనూ రంగారెడ్డి జిల్లా రూ.10,55,913ల తలసరి ఆదాయంతో రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలవగా.. ఉమ్మడి వరంగల్‌లో ఆరు జిల్లాలు ర్యాంకింగ్‌లో 12 నుంచి 29 స్థానాల్లో ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఫర్ క్యాపిటల్ ఇన్‌కం పెరిగినా.. రాష్ట్ర వ్యాప్తంగా వెనుకబడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గతేడాది రూ.2,28,655లతో 15వ స్థానంలో ఉండగా.. ఈసారి రూ.2,57,851కు పెరిగినా 12వ స్థానానికి పరిమితమైంది. గతంలో 19వ స్థానంలో ఉన్న ములుగు ఈసారి రూ.2,49,338లతో 15, రూ.2,44,278లతో వరంగల్ 17, జనగామ రూ.2,33,215లతో 19, మహబూబాబాద్ రూ.2,12,232లతో 29వ స్థానాల్లో నిలవగా, హనుమకొండ జిల్లా రూ.1,99,490లతో 32వ స్థానానికి పడిపోయింది. గతేడాది రూ.1,86,618లతో 31వ స్థానంలో ఉన్న హనుమకొండ ఈసారి తలసరి ఆదాయంలో మరో మెట్టు దిగింది.
జిల్లాల వారీగా తలసరి ఆదాయం...( రూ.లలో)
జిల్లా 2020–21 2021–22 2022–23 2023–24
వరంగల్ అర్బన్ 1,26,594 1,55,055 1,86,618 1,99,490
వరంగల్ రూరల్ 1,65,549 1,95,115 2,20,877 2,44,278
జనగామ 1,66,392 1,86,244 2,21,424 2,33,215
మహబూబాబాద్ 1,44,479 1,79,057 2,00,309 2,12,232
జేఎస్.భూపాలపల్లి 2,03,564 2,34,132 2,28,655 2,57,851
ములుగు 1,55,821 1,75,527 2,15,772 2,44,278
Comments
Please login to add a commentAdd a comment