యూరియా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు●
● జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల
గంగారం: రైతులకు యాసంగిలో పంటలకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, ఎవరైన షాపుల యాజమానులు అధిక ధరకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయాధికారి విజయనిర్మల అన్నారు. గంగారం మండలంలోని పలు ఫర్టిలైజర్ షాపులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం స్టాక్ రికార్డులు పరిశీలించారు. షాపు నోటీసు బోర్డులో ధర పట్టిక రాయాలన్నారు. అనంతరం మొక్కజొన్న పంటను పరిశీలించి రైతులకు తీసుకోవాల్సిన సస్యరక్షణ చర్యలు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి రాంబాబు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment