సరదా.. విషాదమైంది
● ట్రాక్టర్ పైనుంచి జారిపడి బాలుడి మృతి
● పూమ్యాతండా సమీపంలో ఘటన
గార్ల: సరదా.. విషాదమైంది. ట్రాక్టర్ పైనుంచి జారి టైర్ కింద పడి ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన శనివారం పూమ్యాతండా సమీపంలో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గార్ల గ్రామ పంచాయతీ పూమ్యాతండాకు చెందిన బానోత్ సాయికుమార్(15) సరదాగా ట్రాక్టర్‌పై మిరుపతోట వెళ్లాడు. మిర్చిబస్తాలు లోడ్ చేసుకుని వస్తున్న ట్రాక్టర్ పొలం గట్టు ఎక్కుతున్న క్రమంలో ఒక్కసారి కుదుపునకు గురైంది. దీంతో బాలుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పైనుంచి కిందపడ్డాడు. వెనుక టైర్ బాలుడిపైనుంచి వెళ్లగా అక్కడికక్కడే మృతిచెందాడు. సాయికుమార్ గార్లలో 9వ తరగతి చదువుతున్నాడు. కాగా, సాయికుమార్ తండ్రి మంగీలాల్ 3 ఏళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులతో పురుగుమందు తాగి మృతిచెందాడు. సాయికుమార్‌కు తల్లి బుజ్జి, ముగ్గురు అక్కలు ఉన్నారు. కుటుంబంలో ఉన్న ఒక్కగానొక్క మగ దిక్కును కోల్పోయామని మృతుడి తల్లి, అక్కలు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసులు ఘటనా స్థలిని సందర్శిచారు.
Comments
Please login to add a commentAdd a comment