
గుండెపుడిలో తాగునీటి గోస
మరిపెడ రూరల్: మరిపెడ మండలం గుండెపుడి గ్రామస్తులు తాగునీటి కోసం గోస పడుతున్నారు. గ్రామంలోని బర్లపెంట బజార్‌కు మూడు నెలలుగా నీటి సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. గ్రామ పంచాయతీ వాటర్‌మెన్‌కు సమస్య తెలియజేసినప్పటికీ.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాగునీటిని ట్యాంకర్ల ద్వారా తెప్పించుకొని వాడుకునే దుస్థితి నెలకొందని కాలనీవాసులు వాపోయారు. అదేవిధంగా మరికొంత మంది సుదూర ప్రాంతంలోని చేతి పంపు నీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమ కాలనీకి నీటి సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు వేడుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment