
క్రికెట్ బెట్టింగ్‌లు ప్రమాదకరం
● ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్ రూరల్: ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు పె ట్టి జీవితాలను నాశనం చేసుకోవద్దని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. ఆదివారం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. క్రికెట్ బెట్టింగ్‌లు పెట్టి ఆర్థికంగా నష్టపోయి చివరికు ఆత్మహత్య చేసుకుంటే కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌ల వల్ల తమ పిల్లల్లో ఏమైనా మార్పులు కనబడితే తల్లిదండ్రులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేదంటే డబ్బులు, ప్రాణాలు పోయే అవకాశం ఉందన్నారు. బెట్టింగులు పెట్టడం చట్టరీ త్యా నేరమని, ఎవరైనా ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ బెట్టింగ్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఎవరైనా క్రికె ట్ బెట్టింగ్‌కు పాల్పడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, వారి వివరాలు గోప్య ంగా ఉంచుతామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment