
విప్లవ వీరుడు భగత్‌సింగ్
నెహ్రూసెంటర్: దేశ స్వాతంత్య్రం కోసం తమ ప్రాణాలను అర్పించిన విప్లవ వీరులు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖదేవ్ అని నేతాజీ సేవా సమితి అధ్యక్షుడు డాక్టర్ కందుల నాగరాజు అన్నారు. భగత్‌సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో లక్ష్మణ్, వివేక్, గంగాధర్, రోహిత్, రామకృష్ణ, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రఘు, శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వీఓఏల రాష్ట్ర అధ్యక్షురాలిగా మాధవి
మరిపెడ రూరల్: తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలిగా మరిపెడ మండలం చిల్లంచర్ల గ్రామానికి చెందిన మారిపెల్లి మాధవి మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఐకేపీ వీఓఏ ఉద్యోగుల సంఘం ఎన్నికలు నిర్వహించగా మాధవిని రెండోసారి అధ్యక్షురాలిగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాధవికి మరిపెడ మండల వీఓఏల కమిటీ అధ్యక్షుడు రాంపెల్లి వెంకన్న, కమిటీ సభ్యులు కొండూరు వెంకన్న, మౌనిక, పద్మ, శాంతి, సువర్ణ, గీతాదేవి, ఉపేందర్, కరుణమయుడు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
గోటి తలంబ్రాల శోభాయాత్ర
డోర్నకల్: సీతారాముల కల్యాణం కోసం సిద్ధం చేసిన గోటి తలంబ్రాలతో డోర్నకల్‌లో ఆదివారం శోభాయాత్ర నిర్వహించారు. డోర్నకల్ ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో స్థానిక భక్తుల నుంచి సేకరించిన గోటి తలంబ్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శోభాయాత్ర నిర్వహించారు. పాత డోర్నకల్‌లోని హనుమాన్ మందిర్ నుంచి బ్యాంక్‌స్ట్రీట్ వేంకటేశ్వరాలయం, గాంధీ సెంటర్‌లోని ముత్యాలమ్మతల్లి ఆలయం మీదుగా రైల్వే రామాలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.
వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి
మహబూబాబాద్ అర్బన్: మార్కెట్‌లో జరుగుతున్న మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కన్జ్యూమర్ ఫోరం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో వినియోగదారులకు మార్కెట్‌లో జరుగుతున్న మోసాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. వస్తువుల కొనుగోలులో మోసపోయిన వినియోగదారులకు అండగా ఉండి, న్యాయం జరిగే విధంగా పోరాడుతామన్నారు. ఏ వస్తువు కొనుగోలు చేసిన తప్పనిసరిగా రశీదు తీసుకోవాలన్నారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు వస్తువులు విక్రయిస్తే సంబంధిత వివరాలను కన్జ్యూమర్ ఫోరం దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో కృష్ణయ్య, సురేశ్‌నాయక్, మంగు నాయక్, అమృత, వెంకన్న, రాజ్ కుమార్, ఉప్పలయ్య, కృష్ణమూర్తి, లింగయ్య, మల్లేశ్, రమేశ్, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.

విప్లవ వీరుడు భగత్‌సింగ్