బైక్‌ను ఢీకొన్న టిప్పర్..
హసన్‌పర్తి : టిప్పర్.. బైక్‌ను ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందా రు. ఈఘటన హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని హసన్‌పర్తి పెద్దచెరువు సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం.. హసన్‌పర్తి మండలం సీతంపేటకు చెందిన బౌతు మ హేశ్(22), దుర్గం పవన్ కల్యాణ్(22) స్నేహితులు. వీరిద్ద రు డెకర్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆదివారం ఇద్దరు బైక్‌పై వ్యక్తిగత పనినిమిత్తం హసన్‌పర్తికి వచ్చి తిరు గు ప్రయాణంలో సీతంపేటకు బయల్దేరారు. మార్గమధ్యలో ని హసన్‌పర్తి పెద్ద చెరువు మలుపు వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న మొరం టిప్పర్.. బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో మహేశ్, పవన్ కల్యాణ్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు, ఎౖస్సై రవి ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు తెలి పారు. కాగా, జాతీయ రహదారి నిర్మాణం సందర్భంగా మొరం తీసుకొచ్చే టిప్పర్ ఢీకొని రెండు రోజుల క్రితం ఇద్దరు గాయపడినట్లు స్థానికులు చెబుతున్నారు.
మిన్నంటిన రోదనలు..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారనే సమాచారం అందుకున్న కుటుంబీకులు, బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాల మీద పడి గుండెలవిసేలా రోదించారు.
కుందారం వద్ద బైక్‌ను ఢీకొన్న డీసీఎం..
● యువకుడి దుర్మరణం
లింగాలఘణపురం: డీసీఎం.. బైక్‌ను ఢీకొ న్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మర ణం చెందాడు. ఈ ఘటన మండలంలోని జనగామ– సూర్యాపేట రోడ్డుపై కుందా రం క్రాస్ వద్ద జరిగింది. ఎస్సై శ్రావణ్‌కుమార్ కథనం ప్రకారం.. కుందారం గ్రామానికి చెందిన దీగో జు మధు(26) రోజు వారీగా పనికోసం ద్విచక్రవాహనంపై జనగామకు వెళ్తుంటాడు. ఆదివారం కూడా వెళ్తుండగా కుందారం క్రాస్ వద్ద సూర్యాపేట నుంచి జనగామ వైపు వెళ్తున్న డీసీఎం.. కారును తప్పించబోయి ద్విచక్రవాహనంపై వెళ్తున్న మధును ఢీకొనగా అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య, తల్లి, సోదరుడు ఉన్నారు. రోజు పని చేసి కుటుంబాన్ని పోషించుకొనే మధు మృతి చెందడంతో కుటుంబం దిక్కులేనిదయ్యింది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వివరించారు.
● ఇద్దరు యువకుల దుర్మరణం
● హసన్‌పర్తి పెద్దచెరువు సమీపంలో ఘటన
బైక్‌ను ఢీకొన్న టిప్పర్..
బైక్‌ను ఢీకొన్న టిప్పర్..
బైక్‌ను ఢీకొన్న టిప్పర్..
Comments
Please login to add a commentAdd a comment