ఎంజీఎంలో ‘టూడీ’కి స్వస్తి..
ఎంజీఎం : ఎంజీఎం.. ఉత్తర తెలంగాణకు గుండె. పేదలకు పెద్ది దిక్కు. ఇంతటి ఘన కీర్తి కలిగిన ఈ ఆస్పత్రిలో రోజురోజూకూ సేవలు క్షీణించిపోతున్నాయి. నాలుగు ఉమ్మడి జిల్లాలు, కొత్తగా ఏర్పడిన పది జిల్లాలకు చెందిన రోగులు ఆపత్కాళంలో ఎంజీఎంకు వస్తారు. ఇలాంటి ఆస్పత్రిపై దృషి సారించాల్సిన రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఆస్పత్రి పాలనపై దృష్టి సారించకపోవడంతో వామ్మో ఎంజీఎం ఆస్పత్రా అనే విధంగా తయారైంది పరిస్థితి. ఆస్పత్రి విభాగాధిపతులు వారాని రెండు రోజులు విధులకు హాజరువుతున్నారు. వచ్చినా రోజు రెండు, మూడు గంటల పాటు మాత్రమే విధులు నిర్వర్తించడంతో ఒక్కొక్క విభాగం మూత పడుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆస్పత్రిలో అత్యంత కీలకమైన కార్డియాలజీ విభాగం సేవలు పూర్తి అధ్వానంగా తయారయ్యాయి. ఈసీజీ పరికరాల్లో సాంకేతిక లోపాలు, ఏకంగా 24 గంటల పాటు అత్యవసర సేవలు అందించాల్సిన టూడీ ఎకో పరీక్షల పరికరాలను కేఎంసీ తరలించారు. నామామాత్రపు విధులు నిర్వర్తిస్తూ ఎంజీఎంలో టూడీ ఎకో సేవలు బంద్ చేశారు. నిత్యం అందించాల్సిన టూడీ ఎకో సేవలకు స్వస్తి పలికి రెండు, మూడు రోజులకోమారు ఓ ప్రత్యేక అంబులెన్స్‌లో 20 మంది, 30 మందిని తరలిస్తూ నామామాత్రపు సేవలందిస్తూ పేద రోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
శస్త్రచికిత్సల్లో టూడీ ఎకో సేవలు కీలకం..
ఎంజీఎంలో అన్ని విభాగాల్లో నిర్వహించే శస్త్రచికిత్సల్లో ఈసీజీ, టూడీ ఎకో నివేదికలు కీలకం. ఆస్పత్రిలో రోజూ 10 నుంచి 20 శస్త్రచికిత్సలను నిర్వహిస్తుంటారు. ఇలాంటి సేవలను నిలిపివేసి కేఎంసీలోని సూపర్ ఆస్పత్రికి పరిమితి చేసి విధులకు ఏగనామం పెట్టి ప్రైవేట్ కేంద్రాలతో కుమ్మక్క అయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విభాగాలను పర్యవేక్షించే విభాగాధిపతులు విధులకు ఏగనామం పెడుతున్నారు. వారానికి రెండు రోజులు విధులు నిర్వర్తించడం వల్ల ఇలాంటి సమస్యలు తలెతుత్తున్నాయి.
ఆస్పత్రిలో ఎకో సేవలు నిలిపివేత.. కేఎంసీకి తరలింపు
వారానికి రెండు రోజులు మాత్రమే పరీక్షలు
ఇక్కడ కూడా మధ్యాహ్నం
తరువాత సేవలు నిలిపివేత
చేసేదేమిలేక ప్రైవేట్‌కు తరలుతున్న
పేద రోగులు
ప్రైవేట్ కేంద్రాలతో కుమ్మక్కు..
ఎంజీఎంలో టూడీ ఏకో సేవలు కీలకం. ఈసీజీలో ఏమైనా తేడాలు వస్తే వెంటనే టూడీ ఏకో పరీక్షలకు రెఫర్ చేస్తారు. ఈ సమయంలో ఆస్పత్రిలో టూడీ ఏకో సేవలు లేకపోవడంతో కేఎంసీలోని సూపర్ ఆస్పత్రిలో చేయించుకోవాలని రెఫర్ చేస్తారు. కేఎంసీలో మధ్యాహ్నం 12 గంటలు దాటితే సేవలు నిలిపివేస్తారు. ఈ క్రమంలో ఎంజీఎంలో టూడీ ఏకో సేవలను నిలిపివేయడంతో పేద రోగులు, ఖైదీలను రిమాండ్ పంపించే విషయంలోనూ పోలీసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో అత్యవసర రోగులు.. పోలీసు సిబ్బంది సైతం ప్రైవేట్ కేంద్రాలకు వెళ్లి టూడీ ఎకో పరీక్షలు చేయించుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
సమస్య పరిష్కారానికి కృషి
టూడీ ఎకో సేవలు అవసరం ఉన్న వారిని కేఎంసీలోని సూపర్ ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నాం. వివిధ విభాగాల్లో ఫోర్టబెలిటీ పరికరంతో సేవలందిస్తున్నాం. రోగులకు ఇబ్బంది కలగకుండా ఎంజీఎంలోనే టూడీ ఏకో సేవలపై ఆయా విభాగాధిపతులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
– కిశోర్, సూపరింటెండెంట్, ఎంజీఎం
ఎంజీఎంలో ‘టూడీ’కి స్వస్తి..
Comments
Please login to add a commentAdd a comment