ఎల్కతుర్తి: టిప్పర్.. కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ ఘటన మంగళవారం తెల్లవారుజామున భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కఽథనం ప్రకారం..పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్‌టీపీసీ జ్యోతి నగర్‌కు చెందిన కనుకపుడి కరుణాకర్(58) చర్చ్ ఫాదర్. సోమవారం రాత్రి ఒంటి గంటకు కారులో ఎల్కతుర్తి మీదుగా హుస్నాబాద్ వైపునకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యలోని హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి శివారులోని చాయ్ విహార్ సమీపంలో ముల్కనూరు వైపు నుంచి వస్తున్న టిప్పర్ ఎదురుగా కారును ఢీకొంది. ఈ ఘటనలో కారు నడుపుతున్న కరుణాకర్‌కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటనపై మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాయిబాబు తెలిపారు.
● వ్యక్తి దుర్మరణం
● కొత్తపల్లి శివారులో ఘటన