కురవి: పేద విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి ప్ర మాణాలతో కూడిన విద్యను అందించాలనే సంకల్పంతో సమీకృత గురుకులాల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈమేరకు నిధులు కేటాయించింది. సుమారు 20నుంచి 25 ఎకరాల్లో నిర్మించే ఒక్కో సమీకృత గురుకులానికి రూ.200 కోట్లను వెచ్చిస్తోంది. డోర్నకల్ నియోజకవర్గం కుర వి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో గత డిసెంబర్ 8న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ ఇంటిగ్రేటెడ్ గురుకులం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వసతులతో గురుకులాన్ని నిర్మించి ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ పేద విద్యార్థులందరూ ఒకేచోట కలిసి చదువుకోవడాని కి వీలు కల్పించింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో నిర్మాణానికి అడుగులు పడ్డాయి.
ఈ ప్రాంత విద్యార్థులకు మేలు..
డోర్నకల్ నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గురుకులంతో ఎంతో మేలు జరగనుంది. ఇప్పటికే ఉన్న పాఠశాలలకు తోడుగా సమీకృత గురుకుల పాఠశాలతో అన్ని వర్గాల విద్యార్థులు ఒకే చోట చేరి చదువుకోవడం ద్వారా అసమానతలు తొలగుతాయి. కాగా మరిపెడ, చిన్నగూడూరు, డోర్నకల్, కురవి, సీరోలు, నర్సింహులపేట, దంతాలపల్లి మండలాల పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్‌గా మారనుంది. జాతీయ రహదారికి సమీపంలో పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో రవాణా సౌకర్యం సులభతరం కానుంది.
మండలంలో ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాల ఏర్పాటు
స్థల సేకరణతో పాటు
నిధుల కేటాయింపు
శంకుస్థాపన చేసిన ప్రజాప్రతినిధులు
ప్రారంభమైతే
ఈ ప్రాంత విద్యార్థులకు మేలు
పేద విద్యార్థులకు వరం