
దశదినకర్మకు వెళ్తూ మృత్యుఒడికి..
జఫర్‌గఢ్: బంధువు దశదినకర్మకు హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై బయలుదేరిన ఓ వృద్ధురాలు మృత్యుఒడికి చేరింది. రోడ్డుపై ఒక్కసారిగా కుక్కలు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కింద పడింది. ఈ ప్రమాదంలో ఓ వృద్ధురాలు మృతి చెందగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం జఫర్‌గఢ్ శివారు నల్లబండ సమీ పాన కల్వర్టు వద్ద జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పుగల్లులో తమ బంధువు గాదెపాక సాయ మ్మ దశదినకర్మకు హాజరయ్యేందుకు వర్ధన్నపేట మండలం దివిటిపల్లి గ్రామానికి చెందిన జోగు ఉప్పలమ్మ (65), తన చెల్లి జోగు ఎల్లమ్మ, కంజర్ల దయాకర్ ద్విచక్రవాహనంపై బైక్‌పై బయలుదేరారు. ఈ క్రమంలో జఫర్‌గఢ్ శివారు నల్లబండ సమీపాన కల్వర్టు వద్ద కుక్కలు ఒక్కసారిగా అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి వాహనంపై నుంచి ముగ్గురు కిందపడ్డారు. స్థానికులు గమనించి వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అప్పటికే తీవ్రంగా గాయపడిన ఉప్పలమ్మ మృతి చెందింది. ఎల్లమ్మ, దయాకర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై మృతురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్‌చరణ్ తెలిపారు.
● రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి
● ఇద్దరికి గాయాలు
● నల్లబండ సమీపంలో ఘటన