● మిల్లు యజమానిపై కేసు
నెల్లికుదురు: లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 430 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లయీస్ అధికారులు సీజ్ చేశారు. ఈ ఘటన మండలంలోని ఆలేరులో మంగళవారం జరిగింది. జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రేమ్‌కుమార్ కథనం ప్రకారం.. ఆలేరులోని శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్లులో వివిధ గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి సేకరించిన చేసిన రేషన్‌బియ్యం నిల్వ చేశారు. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు మిల్లులో తనిఖీ చేసి లారీలో తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 430 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం రైస్ మిల్లు యజమాని గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కాగా, రేషన్ బియ్యానికి క్లీనింగ్ పాలిష్ చేసి వరంగల్‌లోని సాయి లక్ష్మి రైస్ మిల్లుకు తరలించి విక్రయిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తెలిందన్నారు. ఇదిలా ఉండగా రెండు నెలల క్రితం కూడా శ్రీ రాజరాజేశ్వర రైస్ మిల్లులో నిల్వ ఉంచిన 105క్వింటాళ్లబియాన్ని అధికారులు స్వాధీనం చేసుకోవడం గమనార్హం.