
దండెంపై దుస్తులు ఆరేస్తుండగా..
నర్సంపేట: దండెంపై దుస్తులు ఆరేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన చెన్నారావుపేట మండలం ఎల్లాయిగూడెం గ్రామ శివారు మాధవనగర్ కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన అర్కాల సాంబయ్య(39) జల్లి గ్రామంలోని రైస్‌మిల్లులో కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఆదివారం ఉదయం స్నానం చేసి దండెంపై దుస్తులు ఆరేస్తుండగా ఆ తీగకు విద్యుత్ సరఫరా అయి షాక్‌కు గురయ్యాడు. వెంటనే కుటుంబీకులు చికిత్స నిమిత్తం 108లో నర్సంపేటకు తరలిస్తుండగా మృతి చెందాడు. మృతుడికి భార్య భవాని, కుమారుడు అభిలాశ్, కూతురు శ్యామల ఉన్నారు. సాంబయ్య మృతితో కుటుంబంతోపాటు కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య భవాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నారావుపేట ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు.
● విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి
● మాధవనగర్‌లో ఘటన