
రాములోరి కల్యాణంలో ఫ్లెక్సీల రగడ
కాశిబుగ్గ ఆలయం వద్ద మంత్రి ఫొటో లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
వరంగల్: శ్రీరామనవమిని పురస్కరించుకుని భక్తులకు ఆహ్వానం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై పలువురు ఆరోపణలు చేస్తున్నారు. కాశిబుగ్గలోని సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో కల్యాణోత్సవానికి రూ.8.90 లక్షల నిధులను ప్రభుత్వం నుంచి మంత్రి కొండా సురేఖ మంజూరు చేయించారు. ఆదివారం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మంత్రి సురేఖ, స్థానిక కార్పొరేటర్‌తో పాటు అధికార పార్టీకి చెందిన నాయకుల ఫొటోలు పెట్టకపోవడం సరికాదని కాంగ్రెస్ కార్యకర్తలు అంటున్నారు. ఆలయంలో జరిగే కార్యక్రమాల్లో సైతం నా యకుల వర్గపోరు బయటపడింది. ప్రభుత్వ నుంచి నిధులు మంజూరైనప్పటికీ దాతల డబ్బులతోనే కల్యాణ ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది.
ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీ అరెస్ట్
వరంగల్ క్రైం: ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ బుకీని అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ కొత్త దేవేందర్‌రెడ్డి తెలిపారు. హనుమకొండ పీఎస్ పరిధిలో ఇటీవల పట్టుకున్న క్రికెట్ బెట్టింగ్ ఏజెంట్లు హైదరాబాద్‌కు చెందిన చింతపండు కృష్ణ, మెడిశెట్టి నరేశ్‌తో పాటు ఆటగాళ్లు పులి ఓంకార్, పల్లపు సుకేశ్‌ను అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 1.58 లక్షలు రికవరీ చేసినట్లు తెలి పారు. వారు క్రికెట్ బుకీ వివరాలు తెలపడంతో కా కినాడకు చెందిన గడ్డం వీరమణి కుమార్‌ను ఆదివా రం అరెస్ట్ చేసి నిందితుడి నుంచి రూ. 1.50 లక్షల నగదు, 2 సెల్‌ఫోన్లు, స్వాధీనం చేసుకున్నట్లు ఆయ న పేర్కొన్నారు. హనుమకొండకు చెందిన మరో ఆ టగాడు కితిరి రంజిత్, హైదరాబాద్‌కు చెందిన బుకీ యోగేశ్ గుప్తా పరారీలో ఉన్నట్లు ఏసీపీ తెలిపారు.