ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీగా కొత్తగూడెం ఇంజినీరింగ్‌ కాలేజీ | - | Sakshi
Sakshi News home page

ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీగా కొత్తగూడెం ఇంజినీరింగ్‌ కాలేజీ

Published Tue, Apr 8 2025 7:43 AM | Last Updated on Tue, Apr 8 2025 7:43 AM

ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీగా కొత్తగూడెం ఇంజినీరింగ్‌ కాలే

ఎర్త్‌ సైన్సెస్‌ వర్సిటీగా కొత్తగూడెం ఇంజినీరింగ్‌ కాలే

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీని ఎర్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ తెలంగాణగా అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా ఉత్తర్వులు జారీ చేశారు. సహజవనరులు పుష్కలంగా ఉన్న ఈ ప్రాంతంలో వర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల సీఎం రేవంత్‌ రెడ్డి కూడా వర్సిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. దీనిని అమలులోకి తీసుకొస్తూ ఎర్త్‌సైన్సెస్‌ యూనివర్సిటీ ఆఫ్‌ తెలంగాణ పేరుతో జీఓ జారీ అయ్యింది. ఇందుకు అనుగుణంగా తెలంగాణ యూనివర్సిటీల చట్టం 1991కు సవరణ చేసింది.దీంతో కొత్తగూడెం ప్రాంతవాసులు, విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కేయూ నుంచి బోధన, బోధనేతర,

ఆస్తుల బదలాయింపు!

కొత్తగూడెంలో 1978లో స్కూల్‌ఆఫ్‌మైన్స్‌ ఓయూ పరిధిలోని పీజీ సెంటర్‌గా ఏర్పాటు అయింది. కాకతీయ యూనివర్సిటీ ఏర్పాటైన అనంతరం 1996 నుంచి కొత్తగూడెం స్కూల్‌ ఆఫ్‌మైన్స్‌ కేయూ పరిధిలోకి కొత్తగూడెం మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీగా ఆవిర్భవించింది. అప్‌గ్రేడ్‌ నేపథ్యంలో యూనివర్సిటీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో బోధన, బోధనేతర పోస్టులతో సహా ప్రస్తుతం ఉన్న ఆ కాలేజీ ఆస్తులు కూడా ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి బదలాయింపు జరగబోతుంది. ఇంజనీరింగ్‌కాలేజీలో 41అధ్యాపకుల పోస్టులకుగాను ప్రస్తుతం 16మంది పనిచేస్తున్నారు. పలువురు కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు.అధ్యాపకుల కొరత ఉంది. 106 నాన్‌టీచింగ్‌పోస్టులు ఉంటే 60 మంది వరకు పనిచేస్తున్నారు. వర్సిటీగా అప్‌గ్రేడ్‌తో పోస్టులు పెరిగే అవకాశాలున్నాయి.

అప్‌గ్రేడ్‌ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

కేయూ నుంచి విడిపోనున్న కళాశాల

బోధన, బోధనేతర పోస్టులు,

ఆస్తుల బదలాయింపు కూడా..

ఆ నలుగురి అధ్యాపకుల

డిప్యుటేషన్లు రద్దయ్యే అవకాశం?

ఆ నలుగురి డిప్యుటేషన్లు

రద్దువుతాయా?

కాకతీయ యూనిర్సిటీ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో గతంలో నియామకమై అక్కడ కొంత కాలం పనిచేసి కేయూలోని ఇంజనీరింగ్‌ కళాశాలలకు డిప్యుటేషన్‌పై వచ్చిన వారిలో ఇద్దరు అసోసియేట్‌ ప్రొఫెసర్లు భిక్షాలు, వెంకటరమణ, ఇద్దరు అ సిస్టెంట్‌ ప్రొఫెసర్లు రాధిక, సుమలత ఉన్నా రు. ఇప్పుడు కొత్తగూడెం మైనింగ్‌ ఇంజనీరింగ్‌ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ అయిన నేపథ్యంలో వీరి డిప్యుటేషన్లు రద్దవుతాయా అనే అంశం చర్చగా మారింది. ఎందుకంటే వారి పోస్టులు అక్కడే. అందుకే ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి బదలాయింపు జరగనున్న నేపథ్యంలో వీరు అక్కడికి వెళ్లాల్సింటుందనే అంశం యూనివర్సిటీలో చర్చగా ఉంది. లేదా వారికి ఏమైనా ఆప్షన్‌ ఇస్తారా లేదా వేచి చూడాల్సిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement