
సన్న, చిన్నకారు రైతులపై చిన్నచూపు
మహబూబాబాద్ రూరల్: సన్న, చిన్నకారు రైతులను వ్యాపారులు చిన్నచూపు చూస్తున్నారు. వారు తెచ్చిన ఒకటి, రెండు మిర్చి బస్తాలను కొనుగోలు చేయడం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలోని వివిధ మండలాల నుంచి పలువురు రైతులు సోమ, మంగళవారాల్లో ఒకటి, రెండు బస్తాల మిర్చిని విక్రయించేందుకు మానుకోట మార్కెట్‌కు తీసుకొచ్చారు. కాగా బుధవారం అధికంగా బస్తాలు తీసుకొచ్చిన రైతుల మిర్చి మాత్రమే కొనుగోలు చేసి.. తక్కువ బస్తాలు తీసుకొచ్చిన మిర్చిని కొనుగోలు చేయలేదు. సాయంత్రం వరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో వ్యవసాయ మార్కెట్ నుంచి తమ బస్తాలను తీసుకెళ్లి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుని ఇంటికి వెళ్లామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకటి, రెండు బస్తాలు
తీసుకొచ్చిన వారికి నిరాశ
మిర్చి కొనుగోలు చేయలేదని ఆవేదన
మానుకోట వ్యవసాయ
మార్కెట్‌లో ఘటన

సన్న, చిన్నకారు రైతులపై చిన్నచూపు