
వాగులు లూటీ..
గురువారం శ్రీ 10 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
– 8లోu
చేతులెత్తేసిన అధికారులు
ఇష్టారాజ్యంగా ఇసుక రవాణా చేయడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక పాలసీ తీసుకొస్తామని చెప్పింది. కాగా అప్పటి వరకు ఇసుక రవాణా చేయకుండా ఆపాలని రాష్ట్ర ఉన్నతాధికారులు జిల్లా అధికారులను ఆదేశించారు. దీంతో అప్రమత్తమైన జిల్లాలోని రెవెన్యూ, పోలీస్, మైనింగ్, ఇరిగేషన్ అధికారులు వాగులను తనిఖీలు చేశారు. ఈ క్రమంలో ఆకేరు, మున్నేరు, పాలేరు వాగుల వద్ద నిఘా పెంచారు. ఇసుక రవాణాచేసే వారితో సమావేశం పెట్టారు. 71 మందిని బైండోవర్ చేశారు. 11 మందిపై కేసులు పెట్టారు. పోలీసులు ఔట్‌పోస్టులు పెట్టి ఇసుక రవాణాను అడ్డుకున్నారు. అయితే పదిరోజుల క్రితం పోలీసు ఔట్ పోస్టులను ఎత్తివేశారు. తనిఖీలు బంద్ చేశారు. దీంతో యథేచ్ఛగా ఇసుక రవాణా సాగుతోంది.
సాక్షి, మహబూబాబాద్: ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తామని చెప్పిన అధికారులు.. అనతికాలంలోనే చేతులెత్తేశారు. రెండు నెలలు కట్టుదిట్టంగా ఇసుక రవాణాను అడ్డుకున్నారు. అయితే ఏం జరిగిందో ఏమో కాని పదిరోజులుగా ఆకేరు వారు నుంచి ఇసుక అక్రమంగా తరలుతోంది. ప్రతీరోజు వందలాది ట్రాక్టర్లు.. వేలాది ట్రిప్పుల ఇసుకన తోడుతూ.. వాగును ఖాళీ చేస్తున్నారు. మైనార్టీ తీరని, మ ద్యం మత్తులో డ్రైవర్లు ట్రాక్టర్లను వేగంగా నడిపి ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ట్రాక్టర్ల శబ్దాలకు కంటిమీద కునుకు ఉండడం లేదని ప్రజలు చెబుతున్నారు.
వందల ట్రాక్టర్లు.. వేల ట్రిప్పులు
రెండు నెలల పాటు కట్టుదిట్టమైన బందోబస్తు పెట్టి ఇసుక రవాణాను అడ్డుకొని ఒక్కసారిగా చేతులెత్తేయడంతో ప్రతీరోజు వందల ట్రాక్టర్లు, వేల ట్రిప్పులు తోలుతూ వాగుల వద్ద జాతరను తలపిస్తున్నారు. ప్రధానంగా నర్సింహులపేట మండలంలోని కౌసల్యదేవిపల్లి, జయపురం, కొమ్ములవంచ, రామన్నగూడెం, ముంగిమడుగు, చిన్నగూడూరు మండలం ఉగ్గంపల్లి, నెల్లికుదురు మండల పరిధిలో రాత్రి, పగలూ తేడా లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అయితే స్థానికుల అవసరాలను పక్కన పెట్టి ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ పట్టణాలకు సరఫరా చేస్తున్నారు. ఎంత తోలుకుంటే అంత కావడంతో మైనర్, తప్పతాగిన పలువురు డ్రైవర్లు మితిమీరిన వేగంతో ట్రాక్టర్లు నడపడంతో వాగుల చుట్టూ ఉన్న గ్రామాలతోపాటు, ప్రధాన రహదారి వెంట ఉన్న గ్రామాల ప్రజలు తమకు రాత్రిపూట నిద్రపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యూస్‌రీల్
జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
చేతులెత్తేసిన అధికారులు
రాత్రింబవళ్లు తవ్వకాలు
వందల ట్రాక్టర్లు.. వేల ట్రిప్పులు
స్థానిక అవసరాలకు లేకుండా ఖాళీ

వాగులు లూటీ..