
మరోసారి మెరిసిన మరియపురం!
గీసుకొండ: వరంగల్ జిల్లా గీసుకొండ మండలంలోని జాతీయ ఉత్తమ గ్రామపంచాయతీ మరియపురం మరో సారి మెరిసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో 2022–23 నాటికి గ్రామం రాష్ట్రంలోని టాప్ టెన్ పంచాయతీల్లో ఒకటిగా నిలిచింది. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ రెండు రోజుల క్రితం విడుదల చేసిన ‘పంచాయతీ పురోగతి సూచిక‘లో గ్రామ మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి కృషి ఫలితంగా జిల్లాతో పాటు రాష్ట్రంలోనూ ప్రశంసనీయమైన సూచీ సాధిండం విశేషం. దేశంలో పురోగతి సూచిక కోసం 2.55 లక్షల పంచాయతీలు దరఖాస్తు చేసుకోగా అందులో మరియపురం టాప్ టెన్‌లో నిలిచింది. తెలంగాణ రాష్ట్రంలో 270 గ్రామాలు ‘ఫ్రంట్ రన్నర్’గా(75–90 శాతం) నిలువగా అందులో మరియపురం టాప్ టెన్‌లో 8వ స్థానంలో నిలిచింది. తెలంగాణలో టాప్ 25 గ్రామాల్లో జిల్లా నుంచి మరియపురం నిలవడం గొప్ప విజయంగా చెబుతున్నారు. మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి దూర దృష్టితో ఇప్పటికే గ్రామం సుమారు 25 మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి అవార్డులు 25 దక్కించుకోవడం గమనార్హం.
9 అంశాల్లో రాష్ట్రంలో టాప్ టెన్‌లో గ్రామం
80.71 ఇండెక్స్‌తో
రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు
జిల్లాలో అరుదైన రికార్డు సొంతం
మాజీ సర్పంచ్ అల్లం బాలిరెడ్డి
కృషికి దక్కిన ఫలితం
జిల్లా, రాష్ట్ర స్థాయిలో సాధించిన
పంచాయతీ ఇండెక్స్(పీఏఐ)
అంశం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి
సూచీ సూచీ
జీవనోపాధుల పెంపు 89.03 93.98
ఆరోగ్యం 96.88 99.91
చిన్నారులకు అనుకూలమైన సౌకర్యం 82.81 84.09
తాగునీరు 79.38 86.08
పారిశుద్ధ్యం, పచ్చదనం 83.74 85.86
మౌలిక వసతుల్లో స్వావలంబన 69.71 73.15
సామాజిక భద్రత 81.84 85.34
సుపరిపాలన 81.44 81.68
మహిళలకు అనుకూలమైన విధానం 85.74 89.88

మరోసారి మెరిసిన మరియపురం!