
బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలి
నెహ్రూసెంటర్: రాష్ట్ర విభజన హామీలను అమలు చేసి బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని సీపీఎం రాష్ట్ర నాయకులు జి.నాగయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో గురువారం పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపుతుందని విమర్శించారు. బయ్యారంలో ఉక్కుపరిశ్రమ ఏర్పాటుకు పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రైవేట్ సంస్థలకు కాకుండా, ప్రభుత్వమే పరిశ్రమ ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని, రాష్ట్ర విభజనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, గునిగంటి రాజన్న, ఆకుల రాజు, అల్వాల వీరయ్య, రాజమౌలి, బానోత్ సీతారాంనాయక్, దుడ్డెల రాంమూర్తి, సత్యవతి, గాడిపెల్లి ప్రమీళ, గునిగంటి మోహన్ తదితరులు పాల్గొన్నారు.