
ప్రతి గింజనూ కొనుగోలు చేస్తాం
కురవి: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డోర్నకల్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. గురువారం సీరోలు మండలం ఉప్పరిగూడెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నట్లు తెలిపారు. పేదలందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులు అధైర్యపడొ ద్దని, రైతు భరోసా ఇచ్చామని, రుణమాఫీ పూర్తిగా చేస్తామన్నారు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటుందన్నారు. అలాగే కురవి మండలం మొగిలిచర్లలో పల్లె దవాఖానను ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, మానుకోట మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొండపల్లి కరుణాకర్‌రెడ్డి, తహసీల్దార్ శారద, ఏఓ చాయారాజ్, కాలం రవీందర్‌రెడ్డి, రమేశ్, శంకర్‌నాయక్, ఎం.సురేష్, నూకల వేణుగోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.
మహిళాభివృద్ధికి పెద్దపీట..
డోర్నకల్: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ రాంచంద్రునాయక్ తెలిపారు. మండలంలోని మన్నెగూడెం, వెన్నారం గ్రామాల్లో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఉయ్యాలవాడ గ్రామంలోని పలు వీధుల్లో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. డోర్నకల్‌లో శాంతినగర్, బైపాస్ రోడ్డు, చర్చికాంపౌండ్‌లో నూతనంగా నిర్మించిన సబ్‌సెంటర్ భవనాలను ప్రారంభించారు.అనంతరం బిషప్ అజరయ్య ఫంక్షన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, రూ.1.26 కోట్ల వడ్డీలేని రుణాలకు సంబంధించిన చెక్కును మహిళా సంఘాలకు పంపణీ చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ రవిరాథోడ్, తహసీల్దార్ కృష్ణవేణి, ఎంపీడీఓ శ్రీ నివాసనాయక్, మున్సిపల్ చైర్మన్ ఉదయ్‌కుమార్, ఐకేపీ ఏపీఎం శంకర్‌నాయక్, సీఈఓ సతీష్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సుధాకర్‌నాయక్, మండల వైద్యాధికారి సాధ్విజ పాల్గొన్నారు.
ఎమ్మెల్యే రాంచంద్రునాయక్
ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం