
ధ్యానంతో మానసిక ఒత్తిడి దూరం
మామునూరు: ధ్యాన యోగాతో ప్రతిఒక్కరికీ మానసిక ప్రశాంతత లభిస్తుందని పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ అన్నారు. మామునూరు పోలీస్ శిక్షణ కళాశాలలోని ఆడిటోరియంలో ప్రజాపిత బ్రహ్మకుమారీ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు, సిబ్బందికి శుక్రవారం మానసిక ప్రశాంతతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ప్రిన్సిపాల్ పూజ హాజరై మాట్లాడారు. పోలీస్ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని, ఎలాంటి మానసిక వత్తిడి గురికావొ ద్దని సూచించారు. ఉదయాన్నే వాకింగ్, ధ్యానయోగా చేస్తే ఆరోగ్యంతోపాటు మనసుకు ప్రశాంత త, రోజంతా సంతోషం లభిస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, భిక్షపతి, ఏఓ కల్పనరెడ్డి, డాక్టర్ సుధీర్, ఆర్‌ఐలు చంద్రశేఖర్, నవీన్‌కుమార్, కాశీరామ్, మహేష్, సీఎల్‌ఐ అశోక్, సుధాకర్, ఏఎల్‌ఐ దేవేందర్‌రెడ్డి, దీపక్, సమ్మిరెడ్డి ఆర్‌ఎస్‌ఐ రాజేష్, సుధాకర్, దశరథం, అరుణ, అనిల్, సీసీ రామాంజన్‌రెడ్డి, పీఆర్ ఓ రామాచారి, తహేర్ అలీ, సిబ్బంది పాల్గొన్నారు.
పీటీసీ ప్రిన్సిపాల్ ఇంజారపు పూజ