
ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్‌ఎస్ కార్నర్స్
● డీఎంహెచ్‌ఓ రవి
నెహ్రూసెంటర్: వేసవికాలం దృష్ట్యా ప్రతి ఆరోగ్య సెంటర్, పీహెచ్‌సీల్లో ఓఆర్‌ఎస్ కార్నర్స్ ఏర్పాటు చేయాలని, అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచుకోవాలని డీఎంహెచ్‌ఓ రవి అన్నారు. జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్, హెల్త్ సూపర్‌వైజర్స్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సిబ్బందితో శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. మెటర్నికల్ చైల్డ్ హెల్త్, అసంక్రమిత వ్యాధులు, వ్యాధి నిరోధక టీకాల పంపిణీ, లెప్రసీ, హెచ్‌ఐవీ, జాతీయ కార్యక్రమాల నిర్వహణలో ముందుంజలో ఉండాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ప్రమీల, ప్రోగ్రాం అధికారులు నాగేశ్వర్‌రావు, లక్ష్మీనారాయణ, సారంగం, డీపీఎం నీలోహన, హెల్త్ ఎడ్యుకేటర్స్ కేవీ రాజు, గీత, డీడీఎం సౌమిత్, రాజ్‌కుమార్, డీపీహెచ్‌ఎన్‌ఓ మంగమ్మ, ఎస్‌యూఓ రామకృష్ణ, బడ్డెబోయిన శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.