
‘ప్రాజెక్టు వాణి’తో కృత్రిమ మేధస్సు మెరుగు
మహబూబాబాద్ అర్బన్: ప్రాజెక్టు వాణితో కృత్రిమ మేధస్సు మెరుగుపడుతుందని అదనపు డీఆర్‌డీఏ జయశ్రీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రాజెక్ట్ వాణిపై గ్రామీణ ఉద్యోగులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా జయశ్రీ మాట్లాడుతూ.. ప్రాజెక్టు వాణి అనేది ఒక ఆడియో కలెక్షన్ రప్రాజెక్టు అని, దీని నిర్వహణ ఐఏఎస్‌ఈ బెంగళూరు వారు చేస్తున్నారని, దీనికి గూగుల్ సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సెక్రటరీ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎమర్జింగ్ శాఖ అధికారులు కిరణ్, ఆనంద్, డీసీఎం జిల్లా మేనేజర్ ప్రశాంత్, కోఆర్డినేటర్ గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
పెంచిన రేట్లు
అమలు చేయాలి
మహబూబాబాద్ రూరల్: మహబూబాబాద్ వ్యవసాయ మార్కెట్ పరిధిలో పనిచేస్తున్న దడవాయిలకు పెంచిన రేట్లను అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ మార్కెట్ కమిటీ దడవాయిల యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు సరసాలు సురేందర్ రెడ్డి, అధ్యక్షుడు చింతల ఉప్పలయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు వ్యవసాయ మార్కెట్ సెక్రటరీ షంషీర్‌కు శుక్రవారం వారు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. జిల్లా అదనపు కలెక్టర్ సమక్షంలో నిర్ణయం తీసుకున్న మేరకు వ్యవసాయ మార్కెట్‌లో తమకు కాంటాలు పెట్టే సమయంలో బస్తాకు రూ.6 చొప్పున చెల్లిస్తుండగా కోల్డ్ స్టోరేజీల వద్ద మాత్రం బస్తా కాంటా పెట్టిన సమయంలో రూ.4.50 మాత్రమే చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. పెంచిన ధరలు చెల్లించాలని కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులను అడుగుతున్నప్పటికీ వాళ్లు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఈ విషయమై వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, సెక్రటరీ ప్రత్యేక చొరవ చూపి దడవాయిలను ఆదుకోవాలని కోరారు. లేనిపక్షంలో తమకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 15వ తేదీ అనంతరం నిరసన కార్యక్రమాలు చేపడుతామని వారు పేర్కొన్నారు.
పీఆర్‌టీయూ రాష్ట్ర ఎన్నికల క్రమశిక్షణ చైర్మన్‌గా బద్రినారాయణ
మహబూబాబాద్ అర్బన్: పీఆర్టీయూ రాష్ట్ర ఎన్నికల క్రమశిక్షణ చైర్మన్‌గా సంకా బద్రినారాయణను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులగం దామోదర్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా సంకా బద్రినారాయణ మాట్లాడుతూ.. తనకు రాష్ట్ర ఎన్నికల క్రమశిక్షణ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సంఘం నేత, ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. బద్రినారాయణ నియామకంపై సంఘం మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి భూక్య రామోజీనాయక్, కాపరబోయిన సుజాత హర్షం వ్యక్తం చేశారు.
నేడు గోదావరి హారతి
కాళేశ్వరం: పౌర్ణమి సందర్భంగా మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని త్రివేణి సంగమ గోదావరికి శనివారం(నేడు) సాయంత్రం 5.30గంటలకు హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఈఓ మహేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భక్తులు హారతి కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు.
సక్రమంగా పనులు
పూర్తి చేయండి
కాజీపేట రూరల్: కాజీపేట జంక్షన్‌లో కొనసాగుతున్న అమృత్ భారత్ అభివృద్ధి పనులు సక్రమంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజన్ డీఈఎన్ సెంట్రల్ అధికారి ప్రంజల్ కేసర్ వాణి అన్నారు. శుక్రవారం స్థానిక అధికారులతో కలిసి జంక్షన్‌లో కలియ తిరిగి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పనుల్లో లోపాలు గుర్తించి సక్రమంగా చేయాలని, ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా పనులు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించా రు. అనంతరం జనరల్ వెయింటింగ్ హాల్, బేబీ ఫీడింగ్ గది, టాయిలెట్స్ పనులు పరిశీలించి సలహాలిచ్చారు. అనంతరం రైల్వే స్టేషన్ బ యట అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. ఈతనిఖీలో కాజీపేట రైల్వే ఏడీఈఎన్ రామకృష్ణంరాజు, ఐఓడబ్ల్యూ విజ య్‌కుమార్, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

‘ప్రాజెక్టు వాణి’తో కృత్రిమ మేధస్సు మెరుగు

‘ప్రాజెక్టు వాణి’తో కృత్రిమ మేధస్సు మెరుగు