
27న రాష్ట్ర స్థాయి పారా తైక్వాండో పోటీలు
వరంగల్ స్పోర్ట్స్ : హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ఈ నెల 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్స్ మెన్, ఉమెన్ పారా తైక్వాండో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ పారా తైక్వాండో అసో సియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎన్‌ఎస్ దిలీప్ కుమార్ తెలిపారు. హనుమకొండ భీమారం సమీ పంలో విహరీ హోటల్‌లో ఆదివారం అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు చైన్నెలో మే నెలలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా కన్వీనర్ వెంకటేశ్, వరంగల్ జిల్లా కన్వీనర్లు గణేశ్‌యాదవ్, దిలీప్, గౌతమ్, జనగామ భాస్కర్, ఖమ్మం వెంకటేశ్, ఆదిలాబాద్ అతుల్‌కుమార్, నిజామాబాద్ మనోజ్, మహబూబ్‌నగర్ కన్వీనర్ అజారుద్దీన్ పాల్గొన్నారు.