
‘మండే’ ఎండలు
మంగళవారం శ్రీ 15 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
నాలుగు నెలలు..
– 8లోu
సాక్షి, మహబూబాబాద్: జీవితం నీటి బుడగ లాంటిది. ప్రతీ మనిషికి మరణం తప్పదు. అయితే అది సహజ మరణమైతే.. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు బాధతో కుమిలిపోతారు. అదే హత్య అయితే ఆ ప్రాంత ప్రజలంతా భయాందోళన చెందుతారు. కాగా జిల్లాలో నాలు గు నెలల్లో వరుసగా ఏడు హత్యలు జరిగా యి. ఇందులో అత్యధికంగా తమకు అన్యాయం చేశారనే నెపంతో హత్యలు చేసిన సంఘటనలు ఉండగా.. అయిన వారే సుఫారీ మాట్లాడి చంపించిన ఘటనలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. కాగా వరుస హత్యల నేపథ్యంలో సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు అవగాహన సదస్సులు నిర్వహిస్తామని పోలీసులు చెబుతున్నారు.
హత్యలు ఇలా..
● అనుమానంతో భర్త భార్యను కత్తితో పొడిచి, కట్టెలతో కొట్టి తీవ్ర గాయపరిచి హత్య చేసిన సంఘటన జనవరి 25న కేసముద్రం మండలంలో జరిగింది. మండలంలోని వెంకటగిరి గ్రామానికి చెందిన వాంకుడోత్ సుగుణ( 30)ను తన భర్త వాంకుడోత్ రఘు కత్తితో పొడిచి, కట్టెలతో కొట్టి గాయపరిచాడు. తీవ్ర గాయాలైన సుగుణను చికిత్స నిమిత్తం ముందుగా మహబూబాబాద్ ఆస్పత్రికి, తర్వాత ఎంజీఎంకు తరలించారు. అయితే జనవరి 28న సుగుణ మృతిచెందింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసముద్రం పోలీసులు కేసు నమోదు చేశారు.
● మహబూబాబాద్ పట్టణంలోని సిగ్నల్ కాలనీలో నివాసం ఉంటున్న నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటిపాములకు చెందిన దంపతులు కాటి రాములు–లక్ష్మి, కుమారుడు గోపి, కుమార్తె, అల్లుడు కలిసి కోడలు నాగలక్ష్మిని జనవరి 14న ఇంట్లో చంపారు. ఇంటి ముందు గుంత తవ్వి పూడ్చేశారు. అక్కడే వంట చేసుకొని తిన్నారు. అయితే ఈ కేసును పోలీసులు ఛేదించి నిందితులను అరెస్టు చేశారు.
● భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రానికి చెందిన పార్థసారథి మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని జ్యోతిబాపూలే గురుకులంలో హెల్త్ సూపర్ వైజర్‌గా పనిచేస్తున్నాడు. కాగా తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త పార్థసారథిని చంపేందుకు భార్య స్వప్న, ప్రియుడు వెంకట విద్యాసాగర్‌తో కలిసి రూ.5లక్షల సుఫారీ మాట్లాడింది. ముగ్గురితో భర్తను హత్య చేయించగా.. పోలీసులు కేసును ఛేదించారు.
● సీరోలు మండలం బూర్గుచెట్టు జీపీ పరిధి మాంజా తండాకు చెందిన మాలోత్ కళావతి(38)ని తన భర్త బాలు మటన్ కూర వండలేదని హత్య చేశాడు. దీనిపై సీరోలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
● పాత గొడవల కారణంగా ఇనుగుర్తి మండలం మీఠ్యాతండాకు చెందిన గుగులోత్ రమేశ్(36)ను అదే తండాకు చెందిన గుగులోత్ శంకర్ నమ్మబలికి తనతో ఒంగోలు తీసుకెళ్తానని చెప్పి హత్య చేసిన సంఘటనపై నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
● మార్చి 15న డోర్నకల్ మండలంలోని హూన్యతండాకు చెందిన భూక్య భుజ్జిని కుటుంబ కలహాల నేపథ్యంలో తన భర్త హత్య చేసినట్లు ఆమె బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
● ఫిబ్రవరి 3న డోర్నకల్ మండలంలో జోగ్యతండాలో పిల్లలకు టానిక్‌లో హెర్బిసైడ్ అనే పురుగుల మందును కలిపి తాగించారు. ఈ సంఘటనలో ఐదు సంవత్సరాల నిత్యశ్రీ మృతి చెందిన సంఘటనపై బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం
వరుస సంఘటనలు జరగడంపై శాఖాపరమైన సమీక్షలు నిర్వహిస్తున్నాం. అయితే ప్రధానంగా క్షణికావేశం, ఇతర గొడవలతోపాటు మానవ సంబంధాలు, భార్య, భర్తలు ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోవడంతోనే ఎక్కువ హత్యలు జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలపై ప్రజల్లో అవగాహన కల్పించడం, కళాజాత ద్వారా మానవ సంబంధాలు పెంచేందుకు ప్రదర్శనలు ఇప్పించే పనిలో ఉన్నాం.
–తిరుపతిరావు, డీఎస్పీ, మహబూబాబాద్
న్యూస్‌రీల్
క్షణికావేశంతో పాటు
తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఘాతుకాలు
సంబంధికుల చేతిలో
హతమవుతున్న వైనం
వరుస ఘటనలతో
జిల్లా ప్రజల ఆందోళన
అవగాహన సదస్సులు
పెంచుతామంటున్న పోలీసులు

‘మండే’ ఎండలు

‘మండే’ ఎండలు