
మోటార్లతో నీటిని తోడేశారు
జనగామ: జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌లో ఏ రైతును కదిలించిన కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఆదివా రం కురిసిన భారీ వర్షంతో 20వేల బస్తాలకు పైగా ధాన్యం తడిసి పోగా, వరద వెళ్లే దారిలేక ధాన్యం రాశుల పక్కనే నిలిచి ముంచేసింది. నీటిలో ముని గిన ధాన్యాన్ని బయటకు తీసేందుకు రైతులు మో టార్లు పెట్టి తోడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జనగామ మండలం చౌడారం గ్రామానికి చెందిన రైతు దండబోయిన రజిత కుటుంబం ఐదు ఎకరాలు సా గు చేయగా, 200 బస్తాల దిగుబడి వచ్చింది. ప్రభు త్వ మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఐకేపీ సెంటర్‌కు నా లుగు రోజుల క్రితం ధాన్యం తీసుకొచ్చారు. తేమ పేరుతో కొనుగోలు ఆలస్యం కావడంతో అకాల వర్షం 200 బస్తాలను ముంచేసింది. 20 బస్తాలు వరదలో కొట్టుకుపోయాయి. రాత్రి 7.30 గంటల నుంచి సోమవారం ఉదయం 11 గంటలకు వరకు 180 బస్తాల ధాన్యం నీటిలోనే ఉండిపోయింది. దీంతో రైతులు ఇంట్లో వినియోగించే నీటి మోటారును తీసుకొచ్చి కుటుంబమంతా నాలుగు గంటల పాటు కష్టపడి తోడేశారు. ఒక్క అధికారి వచ్చి పలకరించలేదని, టార్పాలిన్ కవర్లు సైతం ఇవ్వలేదని మహిళా రైతు రజిత.. కన్నీరుమున్నీరుగా విలపించారు. 12 గంటలపాటు తడిసిన ధాన్యం మొలకెత్తే పరిస్థితి ఉందని ఆందోళనే వ్యక్తం చేస్తున్నారు.
జనగామ మార్కెట్
ఐకేపీ సెంటర్‌లో రైతుల గోస

మోటార్లతో నీటిని తోడేశారు