మహబూబ్‌నగర్: అర్ధరాత్రి గురుకుల పాఠశాలలో యువకుడు హల్‌చల్ చేసి విద్యార్థుల కాళ్లు పట్టిలాగడంతో భయాబ్రాంతులకు గురయ్యారు. రెండు రోజుల క్రితం ఈ ఘటన జరిగినా ఉపాధ్యాయులు బయటకు పొక్కనివ్వలేదు. శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మండలంలోని సల్కర్‌పేట్ ప్రభుత్వ గిరిజన బాలికల మినీ గురుకుల పాఠశాలలోకి బుధవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని యువకుడు ప్రవేశించాడు. విద్యార్థినులు మొదటి అంతస్తు రెండు డార్మెంట్లలో పడుకుంటారు. యువకుడు మెట్ల ద్వారా విద్యార్థినీలు నిద్రిస్తున్న గదుల్లోకి వెళ్లి కాళ్లు పట్టి లాగాడు. దీంతో విద్యార్థినీలు భయాబ్రాంతులకు గురై లేవడంతో వారిని బెదిరించాడు.
రెండో డార్మెంట్‌లోకి వెళ్లి అక్కడ విద్యార్థినీలు కాళ్లు లాగి వారిని బెదిరించడంతో అరవకుండా ఉండిపోయారు. 150 మంది విద్యార్థినీలున్న గురుకులంలో యువకుడు పదినిమిషాలు తిరుగాడినట్లు సీసీపుటెజిలో నిక్షిప్తమైంది. గురువారం ఉదయం ఈ విషయాన్ని పిల్లలు ఉపాధ్యాయులకు చెప్పారు. రెండు రోజులైన ఈ విషయాన్ని బయటికి రాకుండా ఆరోజు విధుల్లో ఉన్న ప్రిన్సిపాల్ పద్మ జాగ్రత్త పడ్డారు.
ఈ విషయం తెలియడంతో శుక్రవారం బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు పెంట్యానాయక్ గురుకులానికి వెళ్లి ఉపాధ్యాయులను నిలదీశాడు. ఘటన జరిగి రెండు రోజులైన పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపాడు. గతంలో పాపా కూడా గురుకులం నుంచి పారిపోయింది. అప్పుడు కూడా ప్రిన్సిపాల్ పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఈ విషయంపై ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ను వివరణ కోరగా రెండో రోజు కూడా యువకుడు వస్తాడేమోనని కారంపొడి, రాళ్లు దాడి చేయడానికి పెట్టుకున్నామన్నారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేయలేదని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment