పీయూలో రిటైర్డ్ ఉద్యోగుల తొలగింపు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో కొన్నేళ్లుగా తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న 14 మందికిపైగా రిటైర్డ్ ఉద్యోగులను అధికారులు తొలగించారు. మాజీ వీసీలు రాజారత్నం, లక్ష్మీకాంత్ రాథోడ్ హయాంలో రిటైర్డ్ అయిన పలువురిని సీనియార్టీ, సర్వీస్ నిమిత్తం నియమించారు. అయితే నియామక సమయంలో గత వీసీలకు అనుకూలంగా ఉన్న వారిని, తమకు కావాల్సిన వారిని అధిక వేతనాలు ఇచ్చి నియమించారన్న ఆరోపణలు ఉన్నాయి. వారిలో కొందరు అడ్మినిస్ట్రేషన్ విభాగం, పీజీ కళాశాల, పరీక్షల విభాగం, అకౌంట్స్ విభాగాల్లో ఉద్యోగులుగా, మరికొందరు సింథటిక్ ట్రాక్, ఇంజినీరింగ్ విభాగంలో కన్సల్టెంట్లుగా పనిచేశారు. రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి ఒక్కొక్కరికి రూ.25 వవేల నుంచి రూ.60 వేలకు పైగా వేతనాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. కొంతమంది వయోభారంతో ఇబ్బంది పడుతున్నా విధుల్లో కొనసాగించారు. అయితే ఇటీవల టీజీపీఎస్సీ ద్వారా ఏడుగురు ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులర్ ప్రాతిపదికన నియమించడంతో రిటైర్డ్ ఉద్యోగులను తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు.
● ఈ విషయమై వీసీ శ్రీనివాస్, రిజిస్ట్రార్ స్పందిస్తూ.. ఇటీవల ప్రభుత్వం రెగ్యులర్ ప్రాతిపదికన ఏడుగురు జూనియర్ అసిస్టెంట్లను నియమించడంతో గతంలో తాత్కాలిక పద్ధతిలో నియామకమైన రిటైర్డ్ ఉద్యోగులను ప్రభుత్వ నిబంధనల మేరకు తొలగించామని చెప్పారు. 61 ఏళ్లు దాటిన వారిని మాత్రమే తొలగించామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment