డాక్టర్ రామలక్ష్మణ్‌కు ఏషియన్ స్పోర్ట్స్ లీడర్‌షిప్
మహబూబ్‌నగర్ క్రీడలు: ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిట్‌నెస్ స్పోర్ట్స్ సైన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి జిల్లాకు చెందిన వ్యాయామ సంచాలకులు డాక్టర్ జె.రామలక్ష్మయ్య ఏషియన్ స్పోర్ట్స్ లీడర్ అవార్డు అందుకున్నారు. రామలక్ష్మయ్య మహేంద్రహిల్స్‌లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ వ్యాయామ సంచాలకుడిగా పనిచేస్తున్నారు. ఈయన గతంలో పలు పురస్కారాలు అందుకున్నారు. 2016– 17లో నాగర్‌కర్నూల్ జిల్లా ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్‌గా, 2019లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఫిజికల్ డైరెక్టర్‌గా, 2024లో ఆరెంజ్ వరల్డ్ రికార్డు అవార్డు అందుకున్నారు. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్‌లో 2017 నుంచి 2024 వరకు స్పోర్ట్స్ ఆఫీసర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా రామలక్ష్మయ్య మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డును టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ క్రీడా విభాగం, కోచ్‌లకు అంకితం చేస్తున్నానని తెలిపారు. వారి అంకితభావంతోనే అనేక మంది యువ క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబరిచే అవకాశం పొందారన్నారు. అవార్డు ఇచ్చిన స్ఫూర్తితో భవిష్యత్‌లో మరింత మంది యువ క్రీడాకారులను ప్రోత్సహించి క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కృషిచేస్తానని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment